చిన్నప్పటి నుండే అందం వల్ల ఇబ్బంది పడ్డా

Update: 2020-06-26 13:30 GMT
బాలీవుడ్‌ హీరోయిన్‌ రియా సేన్‌ తన అందంపై తానే ఆసక్తికర కామెంట్స్‌ చేసింది. సుదీర్ఘ కాలంగా ఇండస్ట్రీలో నటిగా కొనసాగుతున్న ఈమె ఇప్పటికి హీరోయిన్‌ గా నటిస్తూనే ఉంది. 39 ఏళ్ల ఈ అమ్మడు స్కూల్‌ లో ఉన్నప్పటి నుండే తన అందమైన రూపం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొందట. స్కూల్‌ లో కూడా ఎక్కువ మంది ఈమె అందం గురించి మాట్లాడేవారట. స్కూల్‌ లో ఉన్నప్పుడే నాకు సెక్సీగా ఉందనే టాగ్‌ పడినదని అందుకే కొన్ని సార్లు ఇబ్బంది పడేదాన్ని అంది.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని గురించి మాట్లాడిన రియా సేన్‌ తనకు కెరీర్‌ ఆరంభం నుండి వచ్చిన ఇమేజ్‌ విషయంలో సంతృప్తిగా లేనట్లుగా చెప్పుకొచ్చింది. కెరీర్‌ ఆరంభం నుండి ఇప్పటి వరకు కూడా ఈమె గ్లామర్‌ షో తోనే ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. ఆ తరహా ఇమేజ్‌ తెచ్చుకున్న రియా సేన్‌ ఇప్పుడు ఆ ఇమేజ్‌ కారణంగానే ఇబ్బంది పడ్డట్లుగా చెప్పడం హాస్యాస్పదంగా ఉందంటూ కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు.
Tags:    

Similar News