పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబినేషన్ లో తెరకెక్కిన బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ `ఆదిపురుష్`. రామాయణం ఆధారంగా పౌరాణిక నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా కనిపించబోతున్నారు. అలాగే సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు.
హై బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని మొదట 2022 ఆగస్టు 11న విడుదల చేయాలని భావించారు. కానీ, పలు కారణాల వల్ల 2023 జనవరి 12 కు విడుదలను పోస్ట్ పోన్ చేశారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా వివిధ భాషల్లో ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల ఆదిపురుష్ టీజర్ ను కూడా బయటకు వదిలారు.
ఈ టీజర్ కు ఎలాంటి స్పందన లభించిందో అందరికీ తెలిసిందే. ఆ సంగతి పక్కన పెడితే.. `ఆదిపురుష్` విడుదల మరోసారి వాయిదా పడబోతోందంటూ తాజాగా ఓ టాక్ బయటకు వచ్చింది. ఈ సినిమా విఎఫ్ఎక్స్ వర్క్ ఆలస్యం అయ్యే అవకాశాలు ఉండటంతో రిలీజ్ ను పోస్ట్ పోన్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని జోరుగా నెట్టింట ప్రచారం జరుగుతోంది.
అంతేకాదు, ఆదిపురుష్ వెనకడుగు వేయడం కారణంగానే ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ దూకుడు చూపిస్తోందనే టాక్ బలంగా వినిపిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై రెండు పెద్ద హీరోల చిత్రాలు నిర్మితమయ్యాయి. అందులో చిరంజీవి `మెగా 154` ఒకటి కాగా.. రెండొవది నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న `ఎన్‌బీకే107`.
బాలకృష్ణ చిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తుంటే.. దునియా విజయ్ విలన్ గా చేస్తున్నారు. ఈ సినిమాకు `వీరసింహారెడ్డి` అనే టైటిట్‌ను ఖరారు చేశారు. అలాగే ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతోందని తాజాగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు.
ఇక `మెగా 154` విషయానికి వస్తే.. ప్రముఖ దర్శకుడు బాబీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మాస్ ఎంటర్టైనర్‌లోనూ శ్రుతి హాసన్‌నే హీరోయిన్ కాగా.. మాస్ మహారాజ్ రవితేజ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. `వాల్తేరు వీరయ్య` అనే టైటిల్ పరిశీలనలో ఉంది. అయితే ఈ సినిమా సైతం సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది. సంక్రాంతి బరిలో ఆదిపురుష్ ఉండుంటే.. చిరు, బాలయ్య చిత్రాల్లో ఏదో ఒకటే విడుదల అయ్యుండేదట. కానీ, ఆదిపురుష్ వెనకడుగుతో మైత్రీ వారు తమ రెండు చిత్రాలను బరిలోకి దింపేస్తున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారం ఎంత వరకు నిజం అన్నది తెలియాల్సి ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.