టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో భారీ చిత్రాలను నిర్మిస్తూ వార్తల్లో నిలుస్తున్న నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్. ఈ సినిమా నిర్మాణ సంస్థ మొదట డిస్ట్రిబ్యూషన్ సంస్థగా ఉండేది. మహేష్ బాబు తో పాటు మరి కొందరు ప్రోత్సాహంతో మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మాతలుగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన విషయం తెల్సిందే.
మైత్రి మూవీ మేకర్స్ ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో దాదాపు అందరు స్టార్ హీరోలతో సినిమాలను నిర్మించేందుకు పెద్ద చిన్న అనే తేడా లేకుండా టాలీవుడ్ లో పదుల సంఖ్యలో సినిమాలను నిర్మించింది.. నిర్మిస్తూనే ఉంది. ఇన్ని సినిమాలు నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ కి ఎప్పుడు రాని సమస్య ఒకటి ఇప్పుడు వచ్చింది.
ఒక నిర్మాణ సంస్థ నిర్మించిన రెండు సినిమాలు ఒకే రోజు విడుదల అవ్వడం చాలా చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. కాస్త గ్యాప్ తో విడుదల అయితే పర్వాలేదు కానీ మరీ ఒకేసారి విడుదల అవ్వడం మాత్రం ఖచ్చితంగా పెద్ద డ్యామేజ్ కలుగుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
ఒకే రోజు రెండు పెద్ద సినిమాలు అయితే కచ్చితంగా రెండు సినిమాలకు నష్టం తప్పదు. ఒక వేళ రెండు సినిమా లు హిట్ అయితే రెండు సినిమాలకు భారీగా నష్టం వాటిల్లుతుంది. గతంలో మాదిరిగా పరిస్థితులు లేవు. కనుక సినిమా సినిమా కు గ్యాప్ తప్పనిసరి అంటున్నారు. అలాంటిది మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించిన రెండు పెద్ద సినిమాలు సంక్రాంతికి పోటీ పడబోతున్నాయి.
చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య మరియు బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమాలు సంక్రాంతి కానుకగా రాబోతున్న విషయం తెల్సిందే. ఈ రెండు సినిమాలను కూడా నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ వారు తప్పనిసరి పరిస్థితుల్లో హీరోల డిమాండ్ మేరకు సంక్రాంతికి రిస్క్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.
వీర సింహారెడ్డి సినిమాను డిసెంబర్ లో విడుదల చేయాలని మైత్రి మూవీస్ వారు భావించారు. కానీ అందుకు బాలయ్య ఒప్పుకోలేదు అనే ప్రచారం జరుగుతోంది. ఆ విషయంలో నిజం ఎంతో కానీ మొత్తానికి మైత్రి మూవీ మేకర్స్ వారు చాలా పెద్ద రిస్క్ ను చేయబోతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.