ఫస్ట్ వీక్ రిపోర్ట్: పోరాడుతున్న 'నా పేరు సూర్య'

Update: 2018-05-11 15:46 GMT
అల్లు అర్జున్ మూవీ నా పేరు సూర్య ఒక వారం పూర్తి చేసుకుంది. సీరియస్ థీమ్ మూవీ కావడంతో ఆశించిన స్థాయిలో మొదటి వారం పెర్ఫామ్ చేయలేకపోయిందనే చెప్పాలి. ప్రపంచవ్యాప్తంగా 75 కోట్ల బిజినెస్ చేసిన ఈ చిత్రం.. తొలి వారం ముగిసే సమయానికి 46 కోట్లకు పైగా షేర్ ను సాధించగలిగింది.

ఏరియాల వారీగా వసూళ్లు

ఉత్తరాంధ్ర         రూ. 4.52 కోట్లు
ఈస్ట్         రూ. 3.20 కోట్లు
వెస్ట్         రూ. 2.47 కోట్లు
కృష్ణా         రూ. 2.32 కోట్లు
గుంటూరు        రూ. 3.68 కోట్లు
నెల్లూరు        రూ. 1.36 కోట్లు
ఆంధ్రప్రదేశ్         రూ. 17.55 కోట్లు
సీడెడ్         రూ. 5.85 కోట్లు
నైజాం         రూ. 11.10 కోట్లు
ఏపీ ప్లస్ తెలంగాణ    రూ. 34.5 కోట్లు
యూఎస్ఏ         రూ. 1.90 కోట్లు
కర్నాటక         రూ. 5.10 కోట్లు
తమిళనాడు        రూ. 2.25 కోట్లు
కేరళ         రూ. 1.50 కోట్లు
రెస్టాఫ్ ఏరియాస్    రూ. 1.25 కోట్లు
ప్రపంచవ్యాప్తంగా మొత్తం     రూ. 46.5 కోట్లు

మొదటివారంలో 76.7 కోట్ల రూపాయల గ్రాస్ ను.. 46.5 షేర్ ను నా పేరు సూర్య వసూలు చేయగలిగింది. తొలి రోజు వసూళ్లతో పోల్చితే.. ఈ మొత్తం తక్కువే అని చెప్పాలి. మొదటి రోజుతో కంపేర్ చేస్తే.. దాదాపు అంతే మొత్తాన్ని మిగిలిన వారం రోజుల సమయంలో వసూలు చేయగలిగింది.

నా పేరు సూర్య సక్సెస్ తీరాన్ని చేరడానికి మరో 30 కోట్ల వసూళ్లు అవసరం. కానీ ఇప్పటికే వసూళ్లు డ్రాప్ కావడం.. మరోవైపు మహానటికి బ్లాక్ బస్టర్ టాక్ రావడం వంటివి.. రెండో వారంలో సూర్య పెర్ఫామెన్స్ పై గట్టి ప్రభావం చూపే అవకాశం ఉంది.

Disclaimer: Figures mentioned here have been collected from few sources and also include estimates. Authenticity can't be guaranteed...!

Tags:    

Similar News