నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా

Update: 2017-02-12 11:56 GMT
గతేడాది సరైనోడుతో సరైన హిట్ కొట్టి ఇండస్ట్రీ హిట్ సాధించిన అల్లు అర్జున్.. ప్రస్తుతం డీజే-దువ్వాడ జగన్నాధం మూవీ చేస్తున్నాడు. చకచకా షూటింగ్ కంప్లీట్ చేసి.. సమ్మర్ లో రిలీజ్ చేయాలన్నది బన్నీ ఆలోచన. ఇక అల్లు అర్జున్ తర్వాతి ప్రాజెక్టుల విషయానికి వస్తే.. ఇప్పటికే వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేయబోతోన్న ప్రాజెక్ట్ ఫైనల్ అయిన సంగతి తెలిసిందే.

లగడపాటి శ్రీధర్ ఈ మూవీతో భారీ చిత్రాన్ని తొలిసారిగా నిర్మించనున్నారు. ఇప్పుడీ మూవీ కోసం టైటిల్ ను కూడా రిజిస్ట్రేషన్ చేయించడం విశేషం. 'నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా' అనే టైటిల్ ని ఫైనల్ చేసుకున్నాడు దర్శకుడు వక్కంతం వంశీ. ఈ టైటిల్ ను నిర్మాత లగడపాటి శ్రీధర్ రిజిస్ట్రేషన్ కూడా చేయించేశారు. టైటిల్ కాస్త లెంగ్తీగా ఉన్నా పవర్ ఫుల్ గా ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక అల్లు వారబ్బాయి స్పీడ్ అయితే.. ఇప్పుడు మామూలుగా లేదు.

డీజేను పూర్తి చేసేస్తున్న అల్లు అర్జున్ ఇప్పటికే లింగు స్వామి దర్శకత్వంలో తెలుగు-తమిళ్ బైలింగ్యువల్ అనౌన్స్ అయిపోయింది. డీజే పూర్తి కాగానే లింగుస్వామితో సినిమా స్టార్ట్ చేయనున్న బన్నీ.. దాంతో పాటే వక్కంతం వంశీ సినిమాని కూడా పట్టాలెక్కిస్తాడట.
Tags:    

Similar News