నాన్నకు ప్రేమతో.. సుకుమార్ డైరెక్షన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేసిన ఈ చేసిన ఈ మూవీ.. ఇప్పుడు రికార్డులకు కేరాఫ్ అడ్రస్ అవుతోంది. ఆన్ లైన్ రికార్డులతో తమ టైగర్ ప్రభంజనం మొదలైందని.. ఆన్ స్క్రీన్ పై సంచలనాలకి సిద్ధమవుతున్నామని ఫ్యాన్స్ అంటున్నారు.
రీసెంట్ గా రిలీజ్ అయిన నాన్నకు ప్రేమతో ఆడియోలో మాత్రం.. ఒక్క పాట కూడా నాన్న కోసం లేకపోవడాన్ని మరికొందరు పాయింట్ చేస్తున్నారు. ఈ సినిమా తండ్రులకు - తల్లులకు నీరాజనం అంటూ... భారీ స్టేట్ మెంట్ నే ఇచ్చాడు ఎన్టీఆర్. మరోవైపు ఈ మూవీ టెక్నికల్ టీం అంతా ఫాదర్ సెంటిమెంట్ ని కురిపించేశారు. కానీ ఆడియోలో మాత్రం ఒక్కటంటే ఒక్కదానిలోనూ నాన్నను గుర్తు చేసుకోకపోవడమే ఆశ్చర్యకరం. నాన్నకు ప్రేమతో ఆల్బంలో.. ఫాలో ఫాలో - హీరోయిన్ వెంటపడుతూ ఎన్టీఆర్ స్వయంగా పాడిన ఒక టీజింగ్ సాంగ్. లవ్ దెబ్బ - కమర్షియల్ మాస్ మసాలా. నీ మనసు నీలో- స్కాట్లాండ్ లో తీసిన మెలోడీ. లవ్ మీ ఎగైన్- రొమాంటిక్ పాట. డోన్ట్ స్టాప్ అంటూ సాగే పాటను స్ఫూర్తినిచ్చేలా తెరకెక్కించారు.
మరి నాన్నపై పాటేది అనే ప్రశ్న సహజంగానే వస్తుంది ? టాలీవుడ్ లో సెంటిమెంట్ సాంగ్సా బాగానే పండుతాయి. అమ్మానాన్న ఓ తమిళమ్మాయిలో 'నీవే నీవే', మహేష్ నానిలో 'పెదవే పలికిన', లోఫర్ లో అమ్మ సెంటిమెంట్ పాటలు బాగానే క్లిక్ అయ్యాయి. మరి టైటిల్ లోనే నాన్నను పెట్టినా.. పాటల్లో మాత్రం ఒక్కటి కూడా తండ్రి కోసం ఛాన్స్ ఇవ్వలేదు. అలాగని, పెట్టి తీరాలని రూల్ ఏం లేదు కానీ.. ఉంటే బాగుండేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.