మెగా బ్రదర్ ను తాకిన బాలయ్య సెగలు

Update: 2019-01-05 10:10 GMT
యథాలాపంగా అన్నా కావాలని కామెంట్స్ చేసినా ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం బయట జనం మీద మాములుగా లేదు. కూడు గుడ్డ నీడ లాగా ఒక 4జి స్మార్ట్ ఫోన్ సర్వ సాధారణం అయిపోయింది. అందుకే లైవ్ లో కాని వీడియో రూపంలో కాని ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్త చాలా అవసరం. లేదంటే లేనిపోని ఇబ్బందులు తప్పవు. మెగా బ్రదర్ నాగబాబుకి ఇది వ్యక్తిగతంగా అనుభవమవుతోంది.

ఇటీవలే బాలకృష్ణ తో పాటు ఎన్టీఆర్ బయోపిక్ ని టార్గెట్ చేసిన నాగబాబు వాటి మీద వ్యంగ్యంగా ఫేస్ బుక్ లో పోస్టులు పెడుతున్న సంగతి తెలిసిందే. వీటి గురించి బాలయ్య ఫ్యాన్స్ గరంగరంగా ఉన్నారు. అయితే ఆన్ లైన్ అంతా నేరుగా కనిపించని ప్రపంచం కాబట్టి దాని సెగలు నాగబాబుకు టచ్ కాలేదు. ఆ సందర్భం కూడా వచ్చేసింది.

ఇటీవలే ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనడం కోసం నాగబాబు అతిధిగా వెళ్ళాడు. అయితే తన ప్రసంగం మొదలుపెట్టిన కొన్ని క్షణాలకే నందమూరి ఫ్యాన్స్ బిగ్గరగా జై బాలయ్య అంటూ స్లొగన్స్ చేస్తూ అతనికి ఏ మాత్రం మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. అయినా కూడా మాట్లాడేందుకు గట్టి ప్రయత్నం చేసిన నాగబాబు చివరికి చేతులెత్తేయక తప్పలేదు. నిమిష నిమిషానికి గోల ఎక్కువ కావడంతో అక్కడి నుంచి అసహనంతో నిష్క్రమించాల్సి వచ్చింది. సో ఆన్ లైన్ లో ఏదో అనేసాం అంటే సరిపోదు. బయట ఎదురయ్యే ఇలాంటి అనుభవాలను కూడా ఫేస్ చేయాల్సి ఉంటుంది.


Full View

Tags:    

Similar News