ప్రభాస్ నెక్ట్స్ `మహానటి` ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించేందుకు గ్రీన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దర్శకహీరోలతో కలిసి వైజయంతి అధినేత అశ్వనిదత్ గ్రాండ్ గా ఈ విషయాన్ని ప్రకటించారు. `బాహుబలి`.. `సాహో`లతో పాన్ ఇండియా స్టార్ గా వెలిగిపోతున్న ప్రభాస్ హీరోగా.. `మహానటి` వంటి జాతీయ స్థాయి సినిమాని రూపొందించిన నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సినిమా అనే సరికి అందరిలోనూ అంచనాలు ఆకాశాన్నిఅంటాయి. ఇది మరో అద్భుతం అవుతుందని అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఆ ఆనందం నుంచి ఇంకా బయటపడనే లేదు.
ఇంతలో ఓ వార్త వారి ఆశలపై నీళ్ళు చల్లింది. ఆనందాన్ని నీరు గార్చింది. ఇంతకీ ఏం జరిగింది? అంటే.. ఈ సినిమా తాజా పరిస్థితుల్లో వాయిదా పడనుందని తెలుస్తోంది. అవును.. ఈ సినిమా అనుకున్న టైమ్ కంటే లేట్ గా ప్రారంభమయ్యే ఛాన్స్ ఉందట. కరోనా వైరస్ కారణంగా ప్రపంచం మొత్తం దాదాపు షట్ డౌన్ అయిపోయింది. దీంతో ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా చిత్రీకరణ వాయిదా పడింది. తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియదు. అనుకున్న ప్రకారం ఇప్పుడు ఫారెన్ లో ఓ భారీ షెడ్యూల్ చేయాల్సి ఉంది. కానీ అది కరోనా పంచ్ తో ఇప్పట్లో ప్రారంభమయ్యేలా లేదు. దీంతో ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడానికి మరో రెండు- మూడు నెలలు ఎక్కువ టైమ్ పడుతుంది. మిగిలిన పోస్ట్ ప్రొడక్షన్స్ ఇలా అన్ని కలుపుకుని దాదాపు నాలుగైదు నెలలు ఎక్కవు టైమ్ పట్టే ఛాన్స్ ఉందని చిత్ర వర్గాలు అంటున్నాయి. ఈ ప్రభావం నాగ్ అశ్విన్ సినిమాపైనా తీవ్రంగా పడనుంది.
నిజానికి నాగ్ అశ్విన్ సినిమాని ఈ ఏడాది చివర్లో ప్రారంభించాలని ప్లాన్ చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో అది వచ్చే ఏడాది పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉందట. దీంతో ఆయన ఫ్యాన్స్ నిరాశలో ఉన్నట్టు టాక్. ఇక ఈ సినిమాని భారీ స్థాయిలో సైన్స్ ఫిక్షన్ గా తెరకెక్కించేందుకు నాగ్ అశ్విన్ ప్లాన్ చేస్తున్నారు. భారీ తారాగణం కూడా ఉంటుందని ఆయన తెలిపారు. ఇదిలా ఉంటే ఇందులో బాలీవుడ్ నటి దీపికా పదుకొనెని హీరోయిన్ గా తీసుకునే ఆలోచనలో చిత్ర బృందం ఉందట. ఈ సినిమాని వైజయంతి మూవీస్ పతాకం పై అశ్వనీదత్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే.
ఇక ప్రస్తుతం ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. దీనికి `జాన్` అనే పేరు ప్రముఖంగా వినిపిస్తుండగా... ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. యూవీ క్రియేషన్స్.. గోపీకృష్ణ మూవీస్ పతాకాలపై వంశీ- ప్రమోద్- కృష్ణంరాజు నిర్మిస్తున్నారు. ఇది ఇటీవలే జార్జియాలో ఓ షెడ్యూల్ ని పూర్తి చేసుకుని వచ్చిన విషయం తెలిసిందే. విదేశాల నుంచి వచ్చిన కారణంగా ప్రస్తుతం ప్రభాస్ క్వారంటైన్ లో ఉన్నారు.