మహానటి అంటూ సావిత్రి జీవితంపై సినిమా తీస్తున్నట్లు దర్శకుడు నాగ్ అశ్విన్ చెప్పినప్పటి నుంచి ఈ చిత్రంపై ఆసక్తి నెలకొంది. రెండున్నర దశాబ్దాల సినిమా చరిత్రలో ఒక భాగం అయిన సావిత్రిని గురించి సినిమా తీయడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఆమె వ్యక్తిగత జీవితంలో కూడా ఎన్నెన్నో మలుపులు ఉంటాయి.
కేవలం వ్యక్తిగత చరిత్రలో.. సినిమా అంశాలనో ఆధారం చేసుకుని ఈ చిత్రం తీయాలని భావించలేదని అంటున్నాడు దర్శకుడు నాగ్ అశ్విన్. అసలు చరిత్రను.. సినిమాను.. సావిత్రిని.. విడదీసి చూడడం సాధ్యం కాదని అంటున్నాడు. సావిత్రి భర్త జెమినీ గణేశన్ గురించి మాత్రమే కాకుండా.. ఎన్టీఆర్.. ఏఎన్నాఆర్ లాంటి దిగ్గజాల గురించి మాట్లాడినా.. గత తరం సినిమాల గురించి మాట్లాడినా కచ్చితంగా సావిత్రి ప్రస్తావన వచ్చి తీరుతుందని.. సినీ రంగంతో ఆమె జీవితం అంతగా పెనవేసుకుపోయిందని చెబుతున్నాడు.
ఆమె చరిత్రను పూర్తిగా చెప్పేందుకే తాను సిద్ధపడ్డట్లు చెబుతున్న నాగ్ అశ్విన్.. సావిత్రి కథ సమగ్రంగానే చూపిస్తానని.. అవసరం అయితే కొన్ని వివాదాస్పద అంశాలను కూడా టచ్ చేసేందుకు వెనకాడలేదని అంటున్నాడు. ఉదాహరణకు.. జెమినీ గణేశన్ దగ్గరకు వెళ్లేందుకు తమ ఇంటి గోడ మీద నుంచి దూకి సావిత్రి వెళ్లడం జరిగిందని.. అలాంటి సందర్భం ఎందుకు వచ్చిందనే విషయం జనాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నాడు మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్.