అక్కినేని క్వారంటైన్ సెల్ఫీ అదిరిందిగా!

Update: 2020-04-27 15:14 GMT
సమంతా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వ్యక్తి.  అయితే ఈమధ్య కొన్ని రోజులు స్లీప్ మోడ్ లో ఉండడంతో అభిమానులకు నిరాశే మిగిలింది. ఈ సమయంలో కొందరు చిత్ర విచిత్ర గాసిప్పులను పుట్టించి కరోనా పండగ చేసుకున్నారు. అయితే సమంతా రెండు రోజుల క్రితం స్లీప్ మోడ్ లో నుంచి బైటకొచ్చి యాక్టివ్ గా మారింది.  సోమవారం భర్త చైతుతో కలిసిఉన్న ఒక సెల్ఫీని ఇన్స్టా స్టోరీస్ లో పోస్ట్ చేసింది.

ఈ బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో చైతు భుజంపై వాలి నవ్వుతూ మంచి పోజిచ్చింది. చైతు కూడా ఈ ఫోటోలో హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు. ఈ ఫోటోపై ఇద్దరినీ కలుపుతూ ఓ రెడ్ కలర్ తో లవ్ సింబల్ ను కూడా పెట్టడం విశేషం. ఎప్పుడూ షూటింగులతో బిజీగా ఈ ఉండే ఈ క్రేజీ కపుల్ కు మొదటి సారి ఫోర్స్డ్ హాలిడే వచ్చింది.  అయితే ఇద్దరూ ఈ హాలిడేని సంతోషంగా గడుపుతూ ఉన్నట్టు ఆ ఫోటోను చూస్తేనే తెలిసిపోతుంది కదా.

సినిమాల విషయానికి వస్తే చైతు కొత్త సినిమా 'లవ్ స్టోరి' ఈ నెలలోనే రిలీజ్ కావాల్సి ఉంది కానీ కరోనా క్రైసిస్ కారణంగా వాయిదా పడింది. మరోవైపు సమంతా రెండు తమిళ సినిమాల్లోనూ 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' అనే వెబ్ సీరీస్ లోనూ నటిస్తోంది.  ప్రస్తుతం షూటింగులు అన్నీ వాయిదా పడ్డాయి కాబట్టి ఇద్దరూ ఇంట్లోనే హాయిగా గడుపుతున్నారు.
Tags:    

Similar News