అంబులెన్స్ కోసం చైతు ఆగ్రహం

Update: 2018-01-26 05:38 GMT
అక్కినేని నాగ చైతన్యకు రోడ్డు కష్టాలు ఎదురవుతున్నాయి. బిజీగా ఉండే ఓ రోడ్డులో ఇరుక్కుపోవడంతో.. నానా తంటాలు పడాల్సి వస్తోంది. ఆ ట్రాఫిక్ ను క్లియర్ చేయడానికి ఎంతో వ్యయ ప్రయాసలకు ఒనర్చాల్సి వచ్చింది. ఈ సమయంలో ఎంతో విసుగు వచ్చేయడంతో.. అక్కడున్న జనాలు అందరిపై కస్సుబుస్సులాడేసి క్లాసులు పీకేస్తున్నాడు. ఇదంతా ఓ అంబులెన్స్ కు దారి ఇవ్వడం కోసం చెప్పుకోవాల్సిన విషయం.

అక్కినేని హీరో ఇలా ఎందుకు చేస్తున్నాడని అనుకోవచ్చు కానీ.. ఇదేమీ వాస్తవం కాదు లెండి. ఓ సినిమాలోని సన్నివేశం. ఇంకా షూటింగ్ కూడా చేయని సీన్ అది. మారుతి దర్శకత్వంలో చైతు హీరోగా ఓ మూవీ తెరకెక్కనుంది. శైలజా రెడ్డి అల్లుడు అనే టైటిల్ ను పరిశీలిస్తుండగా.. ఈ చిత్రంలో రోడ్డుపై అంబులెన్స్ ఇరుక్కుపోయిన సీన్ ఒకటి ఉంటుందట. ఈ సన్నివేశాన్ని బేస్ చేసుకుని డైరెక్టర్ కం రైటర్ అయిన మారుతి ఓ సూపర్బ్ సీన్ రాసుకున్నాడట. ఈ సీన్ కోసం ఇప్పటికే ఓ స్టూడియోలో సెట్ నిర్మాణం కూడా జరుగుతోంది.

అంబులెన్స్ ట్రాఫిక్ లో ఇరుక్కుపోతే పేషెంట్ ప్రాణాలకు ఎంత ప్రమాదమో.. వారి బంధువులు ఎంతగా విలవిల్లాడతారో.. అంబులెన్స్ కి దారి ఇవ్వడం ఎంత ప్రాముఖ్యత గల అంశమో.. చైతు చెప్పే తీరు సూపర్బ్ గా ఉంటుందని తెలుస్తోంది. ఈ సీన్ చూసి ప్రతీ ఒక్కరూ.. అంబులెన్స్ సౌండ్ వినిపించగానే తమంతట తామే దారి ఇస్తారని.. అంతగా మనసులను ఆకట్టుకునేలా దర్శకుడు తెరకెక్కించాలని నిర్ణయించుకున్నాడని తెలుస్తోంది.
Tags:    

Similar News