నాగచైతన్య హీరోగా రూపొందిన 'థ్యాంక్యూ' సినిమా ఈ నెల 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు. చైతూను టాలీవుడ్ కి పరిచయం చేసింది దిల్ రాజునే. చైతూ హీరోగా ఆయన నిర్మించిన 'జోష్' 2009లో థియేటర్లకు వచ్చింది. ఆ తరువాత అటు దిల్ రాజు .. ఇటు చైతూ ఎవరి సినిమాలు వారు చేస్తూ వెళ్లారుగానీ, మళ్లీ కలిసి చేయుటం మాత్రం కుదరలేదు. 12 ఏళ్ల తరువాత వాళ్ల కాంబినేషన్లో రూపొందిన సినిమానే 'థ్యాంక్యూ'.
ఈ సినిమా ప్రమోషన్స్ లో చైతూ మాట్లాడుతూ .. 'జోష్' తరువాత దిల్ రాజు గారి బ్యానర్ నుంచి నాకు కథలు వస్తూనే ఉన్నాయి. కానీ వెంటనే చేసేద్దాం అనిపించే స్థాయిలో అవిలేవు. ఈ కథ మాత్రం వినగానే నాకు బాగా నచ్చేసింది. ఇలాంటి ఒక పాత్ర ఆరిస్టులకు అరుదుగా దొరుకుతుంది.
ఈ సినిమాలో 16 ఏళ్ల నుంచి 36 ఏళ్ల వయసు వరకూ నా ప్రయాణం కొనసాగుతుంది. పాత్రను బట్టి ఆయా ఏజ్ గ్రూప్ లకు సంబంధించినవాడిగా కనిపిస్తాను. టీనేజ్ లుక్ తో కనిపించడానికి కాస్త గట్టిగానే కసరత్తు చేయవలసి వచ్చింది. బరువు కూడా బాగానే తగ్గవలసి వచ్చింది.
'ప్రేమమ్'లో ప్రేమ అనేది జీవితంలో ఆయా దశలను ఎలా ప్రభావితం చేస్తుంది అనేది చూపించడం జరిగింది. కానీ ఈ కథ ఆయా దశల్లో మనకి తారసపడే వ్యక్తుల వలన మన జీవితం ఎలా ప్రభావితమవుతుంది అనేది చూపించడం జరిగింది. 'ప్రేమమ్'లా ఇది ముగ్గురు హీరోయిన్లతో కలిసి నడిచే కథ అనుకోవద్దు. దాని దారి వేరు .. దీని థీమ్ వేరు.
ఈ సినిమాలో రాశి ఖన్నా రోల్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. మాళవిక నాయర్ పాత్ర యూత్ కి వెంటనే కనెక్ట్ అవుతుంది. అవికా పాత్ర చాలా నేచురల్ గా అనిపిస్తుంది. ఈ సినిమాకి సంబంధించిన షూటింగులో 70 శాతం చిత్రీకరణ 'అబ్రాడ్'లో జరిగింది. మిగిలిన చిత్రీకరణ వైజాగ్ .. రాజమండ్రిలలో చేశాము.
ఈ కథ ఒక టైమ్ లైన్లో నడుస్తుంది .. ఆయా సమయాల్లో విడుదలైన మహేశ్ బాబు సినిమాలకి సంబంధించిన టాపిక్ ఉంటుంది. అందుకు సంబంధించిన సీన్స్ ను కూడా ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమ చూశాకా ఇది విక్రమ్ కుమార్ గారు మాత్రమే డీల్ చేయగలిగిన కథ అని చెప్పుకుంటారు. నా కెరియర్లో ఈ సినిమా ప్రత్యేకంగా నిలిచిపోతుందనే నమ్మకం ఉంది. నా నెక్స్ట్ మూవీ వెంకట్ ప్రభు దర్శకత్వంలో షూటింగు జరుపుకుంటోంది. ఆ తరువాత సినిమాలను పరశురామ్ .. తరుణ్ భాస్కర్ లతో చేసే ఛాన్స్ ఉంది" అని చెప్పుకొచ్చాడు.