కొంతకాలంగా చూసుకుంటే చైతూ కెరియర్ బాగానే వెళుతోంది. 'మజిలీ' నుంచి మంచి సినిమాలే పడుతున్నాయి. 'లవ్ స్టోరీ' యూత్ ను ఒక ఊపు ఊపేస్తే .. 'బంగార్రాజు' ఆయనను మాస్ ఆడియన్స్ కి మరింత చేరువ చేసింది. ఇక ఇప్పుడు ఆయన 'థ్యాంక్యూ' సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నాడు. ఈ నెల 22వ తేదీన ఈ సినిమా థియేటర్లకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్నరాత్రి వైజాగ్ లో జరిగింది. ఈ స్టేజ్ పై చైతూ మాట్లాడాడు.
"ఈ రోజున నేను ఇక్కడికి వచ్చింది మీ అందరికీ 'థ్యాంక్యూ' చెప్పడానికే. నా ఈవెంట్ కి ముఖ్య అతిథులు ఎవరూ అవసరం లేదు .. మీరే నా చీఫ్ గెస్టులు. నేను మా తాతగారిని చూసి .. నాన్నగారిని చూసి యాక్టర్ ను అయ్యాను. కానీ సినిమాను ఇంతగా ప్రేమించి చేయడానికి కారణం మాత్రమే మీరే. ఎప్పటికప్పుడు మీకు మంచి సినిమాలు ఇవ్వడానికే నేను ట్రై చేస్తుంటాను. మీ ఎనర్జీ చూస్తుంటే నా కేరాఫ్ అడ్రెస్ నా అభిమానులే అని కాన్ఫిడెంట్ గా చెప్పుకోవచ్చు. అభిమానులకే అభిమానులు మా అక్కినేని అభిమానులు.
'మనం ఎక్కడ మొదలయ్యామనే విషయం మరిచిపోతే మనం చేరిన గమ్యానికి విలువుండదు' అనే ఒక డైలాగ్ ఈ సినిమాలో ఉంది. ఆ డైలాగ్ నన్ను ఎంతో ఆలోచింపజేసింది. నేను వైజాగ్ లో షూట్ చేసిన ప్రతి సినిమా హిట్ అయింది. హీరోగా మరో అడుగు నన్ను ముందుకు తీసుకుని వెళ్లింది. అందువలన నేను వైజాగ్ ను ఎప్పటికీ మరిచిపోలేను. 'థ్యాంక్యూ' అనే మాట ఒక రోజులో చాలాసార్లు వాడుతూ ఉంటాము. కానీ దాని అసలు అర్థం ఏమిటనేది ఈ సినిమా నాకు నేర్పించింది.
ఈ సినిమా మీ అందరినీ కూడా కదిలిస్తుందని నేను బాగా నమ్ముతున్నాను. ఇలాంటి ఒక సినిమాలో చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు ముందుగా రాజుగారికి థ్యాంక్స్ చెప్పాలి. మంచి టీమ్ తో ఒక బంగారం లాంటి సినిమాను నా ముందుకు తీసుకుని వచ్చారు. విక్రమ్ కుమార్ 'మనం' లాంటి సినిమాను మనందరికీ ఇచ్చాడు. అలాంటి మరో గొప్ప సినిమాను మన ముందుకు తీసుకుని రాబోతున్నాడు. 'మజిలీ' మాదిరిగానే ఈ సినిమాకి కూడా తమన్ మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నాను" అంటూ చెప్పుకొచ్చాడు.