బడా ఫ్యామిలీ నుంచి ఓ హీరోను పరిచయం చేయాలంటే సాధారణంగా వాళ్ల కుటుంబ సంస్థ నుంచే అరంగేట్రం చేయించడానికి ప్రయత్నిస్తారు. కానీ అక్కినేని నాగచైతన్య మాత్రం దీనికి భిన్నంగా అడుగులేశాడు. తన తొలి సినిమాను దిల్ రాజు బేనర్లో చేశాడు. ఆ తర్వాత కూడా బయటి బేనర్లకే సినిమాలు చేశాడు. ‘మనం’ సినిమాతో కానీ సొంత బేనర్లో సినిమా చేయలేదు చైతూ. ఇక తన అమ్మ వైపు ఫ్యామిలీకి కూడా పెద్ద బేనర్ ఉన్నప్పటికీ ఇప్పటిదాకా వాళ్లతో సినిమా చేయలేదు. చైతూతో సినిమా చేయాలని అతడి తాతయ్య రామానాయుడు చాలా ఆశపడ్డారు కానీ.. ఈలోపే ఆయన వెళ్లిపోయారు. ఐతే ఎట్టకేలకు సురేష్ ప్రొడక్షన్లో ఓ సినిమా చేయడానికి కమిట్మెంట్ ఇచ్చాడు చైతూ. దగ్గుబాటి సురేష్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.
సురేష్ ప్రొడక్షన్స్ పంజాబీ భాషలో నిర్మించిన సూపర్ హిట్ మూవీ ‘సింగ్ వెర్సస్ కౌర్’కు ఇది రీమేక్ అని ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రాన్ని తెలుగులో తీయాలని చాన్నాళ్ల నుంచి అనుకుంటున్నారు. ఎట్టకేలకు ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ చిత్రంలో చైతూ సరసన లావణ్య త్రిపాఠిని కథానాయికగా అనుకుంటున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ క్రియేటివ్ టీం తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా స్క్రిప్టు తీర్చిదిద్దే పనిలో ఉంది. కృష్ణ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తాడట. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధికారిక సమాచారం వెలువడే అవకాశముంది. దీని కంటే ముందు చైతూ ‘సోగ్గాడే చిన్ని నాయనా’ ఫేమ్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ బేనర్లో ఓ ఓ సినిమా చేయబోతున్నాడు.