కొన్ని సినిమాలంతే. కొబ్బరికాయ కొట్టిన రోజే వ్యాపారం పూర్తి చేసుకొంటుంటాయి. ఇది సేఫ్ ప్రాజెక్ట్ అని తొలి రోజే తేలిపోతుంటుంది. అయితే అలా జరిగేది ఎక్కువగా స్టార్ సినిమాలకే. పవన్ - మహేష్ - అల్లు అర్జున్ లాంటి స్టార్ల సినిమాలు మొదలవుతున్నప్పుడే వ్యాపారం చేసుకొంటుంటుంటాయి. ఏరియాలకి ఏరియాలు హాట్ కేకుల్లా అమ్ముడు పోతుంటాయి. చిన్న హీరోల సినిమాలు మాత్రం విడుదలయ్యాకే నిరూపించుకోవాలి. మౌత్ టాక్ నుంచే లాభాలు రాబట్టుకోవాలి. కానీ అందుకు రివర్స్ గా ఫ్లాపుల్లో ఉన్న నాగచైతన్య చిత్రం కూడా టేబుల్ ప్రాఫిట్ అందుకొందంటే పెద్ద విషయమే కదా. ఆయన నటిస్తున్న ప్రేమమ్ ఒక ఏరియాతోపాటు, 5 కోట్లు టేబుల్ ప్రాఫిట్ తో నిర్మాతలకి లాభాల పంట పండించినట్టు ఫిల్మ్ నగర్ టాక్. మలయాళంలో విజయంతమైన ప్రేమమ్ కి రీమేక్ కావడంతోపాటు, కార్తికేయలాంటి సినిమాని తీసిన సక్సెస్ ఫుల్ డైరెక్టర్ చందు మొండేటి తెరకెక్కిస్తుండడమే అందుకు కారణంగా తెలుస్తోంది.
ప్రేమమ్ చిత్రం మలయాళంలో తెరకెక్కినా దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించింది ఆ చిత్రం. రీమేక్ రైట్స్ కోసం అన్ని భాషల నుంచీ పోటీపడ్డారు. తెలుగులో ఆ రైట్స్ ని రాధాకృష్ణ చేజిక్కించుకొన్నారు. ఆ చిత్రాన్ని చూసి మనసు పడ్డ నాగచైతన్య వెంటనే నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. దీంతో ఓ క్రేజీ కాంబినేషన్ లో ఈ సినిమా పట్టాలెక్కింది. చిత్రీకరణ పూర్తయ్యేలోపు సినిమాకి 17కోట్ల మేర బడ్జెట్ అయ్యే అవకాశాలున్నాయని సమాచారం. అయితే సినిమా మాత్రం హోల్ సేల్ గా 22 కోట్లకి అమ్ముడుపోయినట్టు తెలిసింది. ఒక జిల్లాకి సంబంధించిన హక్కులు నిర్మాత దగ్గరే ఉన్నాయట. ఆ ప్రాంతంలో ఆయన ఓన్ గా రిలీజ్ చేసుకొంటున్నాడట. దీంతో నిర్మాతకి ఆరేడు కోట్లదాకా లాభాలొచ్చే అవకాశాలున్నాయని ట్రేడ్ వర్గాలు లెక్క గడుతున్నాయి. సినిమా విడుదల కాక మునుపే ఇంత లాభమంటే గ్రేటే కదా మరి!