'జోష్' సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన అక్కినేని వారసుడు నాగ చైతన్య కెరీర్ అంతంత మాత్రంగానే ఉంది. ఈయనకు మాస్ ఫాలోయింగ్ తక్కువే. సినిమా ఓపెనింగ్ కూడా పెద్దగా ఉండవనే చెప్పాలి. చైతూ సినిమాతో నాలుగు డబ్బులు సంపాదించిన నిర్మాతలు కూడా అరుదే. అలాంటిది చైతూ సినిమా విడుదలకు ముందే లాభాల్ని చూడడం కాస్త స్వీట్ షాకే.
'ప్రేమమ్' విషయంలో ఇదే జరిగింది. మలయాళంలో ఘన విజయం సాధించిన ప్రేమమ్ ని అదే పేరుతో, చందూమొండేటి దర్శకుడిగా చైతూతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తవలేదు. కానీ సినిమాపై నమ్మకంతో బిజినెస్ మాత్రం బ్రహ్మాండంగా జరిగిపోయింది. ఒకట్రెండు ఏరియాలు మినహా.. సినిమాని అమ్మేశారట. ఆ లెక్క ప్రకారం చుస్తే నిర్మాతకు 5 కోట్ల వరకు టేబుల్ ప్రాఫిట్ దక్కిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. చైతూ సినిమాల్లో ఇదో రికార్డుగా చెప్పుకోవొచ్చేమో..??