అక్కినేని నాగచైతన్య కెరీర్ లోనే పీక్ స్టేజ్ లో ఉన్నాడు. తనకు స్ట్రెంగ్త్ ఉన్న లవ్ జోనర్ లోకి వచ్చేసి.. రా రండోయ్ వేడుక చూద్దాం మూవీతో కెరీర్ బెస్ట్ హిట్ కొట్టేశాడు. ఇప్పుడు థ్రిల్లర్ తో ఆకట్టుకునేందుకు కొత్త ప్రయత్నం చేస్తున్నాడు చైతు.
కృష్ణ మరిముత్తు దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ కోసం.. అరకులో షూటింగ్ చేస్తున్నాడు నాగ చైతన్య. సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ఈ చిత్రం.. థ్రిల్లర్ జోనర్ లో ఉండనుండగా.. ఇప్పటివరకూ తెరకెక్కించిన సన్నివేశాలపై.. యూనిట్ తెగ ఖుషీగా ఉంది. ప్రస్తుతం హీరో ఫ్యామిలీకి సంబంధించిన సీన్స్ ను తెరకెక్కిస్తుండగా.. చైతు అమ్మానాన్నలుగా రేవతి.. రావు రమేష్ లు నటిస్తున్నారు. ఈ ముగ్గురిపై ప్రస్తుతం కీలకమైన సీన్స్ తీస్తున్నాడు దర్శకుడు కృష్ణ. ముఖ్యంగా తండ్రీ కొడుకుల మధ్య వచ్చే సీన్స్ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు యూనిట్.
సెంటిమెంట్.. థ్రిల్లర్.. ఈ రెండు జోనర్లను సమపాళ్లలో మిక్స్ చేసి రూపొందిస్తున్న ఈ చిత్రానికి.. స్క్రీన్ ప్లే హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నాడు డైరెక్టర్ కృష్ణ. తన జీవితంలో ఎదురయ్యే కొన్ని సంఘటనలకు సంబంధించి అన్వేషించే పాత్రగా హీరో నాగచైతన్య కేరక్టర్ ఉంటుంది. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తుండగా.. రాజమౌళి కుమారుడు కార్తికేయ ప్రొడక్షన్ చూసుకుంటున్నాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/