తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు 'పవిత్రబంధం' సీరియల్ తో సుపరిచితురాలు అయిన జాన్సీ కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని అపార్ట్ మెంట్ లో ఉరి వేసుకుని మరణించిన విషయం తెల్సిందే. మొదట పోలీసులు జాన్సీ మరణం సహజ మరణం అని, ఆత్మ హత్య అని భావించారు. అయితే జాన్సీ కుటుంబ సభ్యుల ఆరోపణల నేపథ్యంలో ఆమె ప్రియుడు సూర్య తేజ ను విచారించారు. అతడు మానసికంగా వేదించడం వల్లే జాన్సీ ఆత్మహత్యకు పాల్పడ్డట్లుగా పోలీసులు నిర్థారణకు వచ్చారు.
తాజాగా పోలీసులు సూర్య తేజను అరెస్ట్ చేసి సిటీ కోర్టులో హాజరు పర్చడం జరిగింది. రెండు వారాల పాటు సూర్య తేజకు జ్యుడీషియల్ కస్టడీని కూడా విధించడం జరిగింది. పంజాగుట్టా పోలీస్ కమీషనర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ జాన్సీ ఆత్మహత్యకు కారణం సూర్య తేజ వేదింపులు కారణం అంటూ పేర్కొన్నాడు. జాన్సీని నటనను వదిలేయాల్సిందిగా సూర్య తేజ పదే పదే వేదించాడట. దాంతో పాటు ఆమె ప్రతి కదలికపై నిఘా పెట్టడంతో పాటు, ఆమె ఏం చేసినా కూడా అనుమానించడం, అవమానించడం చేసేవాడట.
ఆమె తీవ్ర మనోవేదనతో ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు పేర్కొన్నారు. గత నవంబర్ లో నటన వదిలేస్తేనే మా తల్లిదండ్రులు మన పెళ్లికి ఒప్పుకుంటారంటూ చెప్పాడట. అప్పటి నుండి కూడా ఆమెను సూర్య వేధిస్తూ వస్తున్నట్లుగా పోలీసుల విచారణలో తేలిందట.