యంగ్ హీరోల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాగశౌర్య సినిమా రిలీజై ఏడాది దాటిపోతోంది. అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన జ్యో అచ్యుతానంద సినిమాలో నారా రోహిత్ తమ్ముడిగా చక్కగా నటించి ప్రేక్షకులను మెప్పించాడు. ఆ తరవాత తక్కువ టైంలోనే వచ్చిన నీజతలేక సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా కొట్టింది.
లాంగ్ గ్యాప్ తర్వాత నాగశౌర్య ఈ ఏడాది చివరిలో ఛలో సినిమా ద్వారా థియేటర్లకు రానన్నాడు. ఛలో సినిమాను స్వయంగా నాగశౌర్య తండ్రి శంకర్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేసి డిసెంబర్ 29న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు శంకర్ ప్రసాద్ చెబుతున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ వద్ద అసిస్టెంట్ గా పనిచేసి కదుముల వెంకీ ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ‘‘డైరెక్టర్ వెంకీ కథను నెరేట్ చేసినప్పుడు ఏం చెప్పాడో అదే తెరపై చూపించాడు. ఈ సినిమా కోసం మనసు పెట్టి పనిచేశాడు’’ అంటూ ప్రొడ్యూసర్ చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది.
నాగశౌర్య ఛలోతోపాటు ప్రస్తుతం తెలుగు- తమిళ ద్విభాషా చిత్రం ‘కణం’ చేస్తున్నాడు. ఇందులో ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్న సాయి పల్లవి ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. తమిళంలో ‘కరు’ పేరుతో తెరకెక్కుతోంది. అభినేత్రి ఫేం ఎ.ఎల్.విజయ్ ఈ సినిమాకు డైరెక్టర్.