'కృష్ణ వ్రిందా విహారి' డైల‌మాకి కార‌ణం?

Update: 2022-04-08 01:30 GMT
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ క్ష‌ణం తీరిక లేనంత బిజీగా ఉన్న న‌టుల్లో నాగ‌శౌర్య పేరు ఉంది. జ‌యాప‌జ‌యాల‌తో ప‌ని లేకుండా అత‌డు వ‌రుస‌గా చిత్రాల్లో న‌టిస్తున్నాడు. సొంత బ్యాన‌ర్ లో న‌టిస్తూనే బ‌య‌టి బ్యాన‌ర్ల‌కు ప‌ని చేస్తున్నాడు. తాజాగా అత‌డు న‌టిస్తున్న `కృష్ణ వ్రిందా విహారి` రిలీజ్ అప్ డేట్ లేక‌పోవ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఇది రొమాంటిక్ ఎంటర్ టైనర్..  నాగ శౌర్య స‌ర‌స‌న‌ బాలీవుడ్ నటి షిర్లీ సెటియా న‌టిస్తోంది. అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఐరా క్రియేషన్స్ నిర్మించింది.

తాజా గుస‌గుస‌ల ప్ర‌కారం.. `కృష్ణ వ్రిందా విహారి` వాయిదా పడినట్లు తెలుస్తోంది. తొలుత‌ ఈ చిత్రం 22 ఏప్రిల్ 2022న ప్రేక్షకుల ముందుకు రానుందని మేకర్స్ వెల్లడించారు. కానీ ఉగాది శుభాకాంక్షలు పోస్టర్ లో కానీ మొదటి పాట ప్రకటన పోస్టర్ లో కానీ మేకర్స్ విడుదల తేదీని పేర్కొనలేదు. దీంతో రిలీజ్ తేదీపై అభిమానుల్లో ప్రేక్షకుల్లో అనుమానాలు నెలకొన్నాయి. అయితే టీమ్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

శౌర్య కొన్ని వ‌రుస ప్ర‌యోగాల‌తో ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. ఈసారి కూడా నేటిత‌రం మెచ్చే కంటెంట్ తో వ‌స్తున్నాడు. రాధికా శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తుండ‌గా.. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్- సత్య- బ్రహ్మాజీ- రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. స్వర సాగర్ మహతి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
Tags:    

Similar News