సినిమా ఒకటే .. కానీ అందులో ఏకంగా ఏడు గెటప్పుల్లో నటించి సర్ ప్రైజ్ చేస్తాడట నాగశౌర్య. ఇటీవలే `ఓ బేబి`లో కామియోలో కనిపించినా చక్కని నటనతో ఆకట్టుకున్న శౌర్య ప్రస్తుతం వరుసగా సినిమాల్లో నటిస్తున్నాడు. ఓ బేబి సక్సెస్ సందర్భంగా మీడియా ఇంటరాక్షన్ లో తాను చేస్తున్న ప్రాజెక్టుల గురించి ఆసక్తికర సంగతుల్ని రివీల్ చేశారు శౌర్య.
సొంత బ్యానర్ లో `అశ్వర్ధామా` చేస్తున్నా. అలాగే `ఊహలు గుసగుసలాడే` కాంబినేషన్ రిపీటవుతోంది. అవసరాల దర్శకత్వంలో `ఫలానా అబ్బాయి- ఫలానా అమ్మాయి` చిత్రంలో నటిస్తున్నా. ఇందులో ఏడు గెటప్పుల్లో కనిపిస్తాను. ఒకే పాత్రలో ఏడు షేడ్స్ ని చూపించే ఛాన్స్ దక్కింది. వీటితో పాటు `పార్థు` అనే వేరొక చిత్రంలోనూ నటిస్తున్నా.. అని సినిమాల క్యూ గురించి చెప్పారు శౌర్య. అలాగే అశ్వత్థామ చిత్రానికి కథ అందించాను. రెండు షెడ్యూళ్లు పూర్తయ్యాయి. దీనికి నా పేరు టైటిల్స్ లో వేసుకుంటున్నా.. ఇంతకుముందు ఛలో చిత్రానికి కథ అందించినా నా పేరు వేసుకోలేదు.. అని తెలిపారు.
`ఓ బేబి`లో కామియో చేశారు... ఇలాంటివి హీరోగా మీ ఇమేజ్ కి ఇబ్బంది కాదా? అని ప్రశ్నిస్తే.. అలాంటిదేమీ లేదని నాగశౌర్య అన్నారు. ``హిట్ సినిమాలో భాగం కావాలనే చేశాను. పైగా నందిని రెడ్డి అక్కలాంటిది. అవసరాల కుటుంబ సభ్యుడితో సమానం. నందిని నాకు ఆ పాత్రను చెప్పాలా వద్దా? అని డైలమాలో ఉన్నప్పుడు మా అమ్మ (ఉష ముల్పురి) నా చేత ఓకే చేయించారు. కథ వినగానే హిట్టయ్యే చిత్రమిది అనిపించి వెంటనే ఓకే చేశాను`` అని తెలిపారు.