పెద్ద ఎన్టీఆర్ పేరును పాడు చేయమంటున్న శౌర్య!

Update: 2018-08-01 05:28 GMT
ఎన్నైనా చెప్పండి కొన్నిటితో మనకు విడదీయరాని అనుబంధం ఉంటుంది.  అలాంటి వాటిలో తెలుగువారి అభిమాన కథానాయకుడైన పెద్ద ఎన్టీఆర్ సినిమాలు కూడా తప్పనిసరిగా ఉంటాయి. అలాంటప్పుడు ఆయన నటించిన క్లాసిక్ సినిమాల పేర్లు వాడితే సహజంగానే కాస్త వ్యతిరేకత వస్తుంది.  వాడకూడదని కాదు .. అలాంటి రులేమీ లేదు కానీ ఆ క్లాసిక్స్ పేర్లను ఎందుకు పాడుచేయాలన్నదే ఇక్కడ పాయింట్.

కానీ ఈ జెనరేషన్ మేకర్స్ చాలామంది ఆపాతమధురాలైన కొన్ని సినిమా టైటిల్స్ ని తమ కొత్త  సినిమాలకు పెడుతుంటారు. అలానే నాగ శౌర్య తాజా చిత్రానికి ఎన్టీఆర్ క్లాసిక్ 'నర్తనశాల'  పేరు పెట్టారు.. కొంచెం మార్చి '@నర్తనశాల' పేరు పెట్టారనుకోండి అది వేరే విషయం.  దీంతో కొత్త దర్శకుడు శ్రీనివాస చక్రవర్తి- నాగ శౌర్య టీమ్ పై కొన్ని విమర్శలు కూడా వచ్చాయి.  ఈ సినిమా టైటిల్ గురించి హీరో నాగ శౌర్య రీసెంట్ గా ఓ  క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.

సీనియర్ ఎన్టీఆర్ పేరును తామేమాత్రం పాడుచెయ్యలేదని,  ఇంటర్వెల్ వచ్చే సమయానికల్లా ప్రేక్షకులకు ఆ టైటిల్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందనే విషయం అర్థం అవుతుందని చెప్పాడు.  ఈ సినిమా టైటిల్ ప్రకటించిన రోజు నుండే ఈ సినిమాలో నాగశౌర్య బృహన్నల టైపు క్యారెక్టర్ చేస్తున్నాడని వార్తలు వచ్చాయి.  ఆ విషయంపై నాగశౌర్య క్లారిటీ ఇవ్వలేదుగానీ ఈ స్టేట్మెంట్ తో ఇండైరెక్ట్ గా హింట్ అయితే ఇచ్చినట్టే.  మరి పెద్ద ఎన్టీఆర్ క్లాసిక్ టైటిల్ ని పాడు చేశారా లేదా ఈ జెనరేషన్ బృహన్నల లా శౌర్య ప్రేక్షకులను మెప్పిస్తాడా అన్నది వేచి చూడాల్సిందే.
Tags:    

Similar News