కొత్త దర్శకులతో కుర్ర హీరో ఛలో ఛలో

Update: 2018-08-20 13:06 GMT
హీరో నాగ శౌర్యకు ఛలో ఇచ్చిన కిక్ బాగా ఎక్కేసింది కాబోలు వరసగా కొత్త టాలెంట్స్ ని ప్రోత్సహించే పనిలో పడ్డాడు. స్టార్ డైరెక్టర్స్ కోసం వేచి చూసి నెలలు ఏళ్ళు టైం వేస్ట్ చేసుకోవడం కంటే ఫ్రెష్ బ్యాచ్ ని ఎంకరేజ్ చేస్తే తనకూ వాళ్లకు ఉభయలాభంగా ఉంటుందని ఈ మార్గం ఎన్నుకున్నాడు. ఛలోతో పరిచయమైన వెంకీ కుడుముల ఇప్పటికీ క్రేజీ ఆఫర్స్ తెచ్చుకుంటుండగా @నర్తనశాలతో పరిచయమవుతున్న శ్రీనివాస్ చక్రవర్తి టీజర్ తోనే ఆకట్టుకున్నాడు. సినిమా మీద ఇప్పటికే ట్రేడ్ లో  మంచి బజ్ ఉంది. ఇది కాకుండా మరో రెండు ప్రాజెక్టులు నాగ శౌర్య లైన్ లో పెడుతున్నట్టు సమాచారం. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై రాజా కొలుసును దర్శకుడిగా పరిచయం చేస్తూ నారి నారి నడుమ మురారి అనే టైటిల్ తో త్వరలోనే షూటింగ్ మొదలుపెట్టబోతున్నట్టు  సమాచారం. ఇది 90వ దశకంలో బాలకృష్ణ నటించిన ఎవర్ గ్రీన్ మ్యూజికల్ హిట్ టైటిల్. ఇది కాకుండా గణ పేరుతో రమణ తేజ అనే మరో డైరెక్టర్ డెబ్యూ మూవీ కూడా నాగ శౌర్య హీరోగా రూపొందనుంది. మొత్తానికి ఒకే ఏడాది 4 కొత్త దర్శకులతో చేసిన అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకోబోతున్నాడు శౌర్య.

ఇలా ఎందుకయ్యా అని అడిగితే కొత్త వాళ్లలో ఉండే కసి సినిమాను ఇంకా బాగా వచ్చేలా చేస్తుందని సమాధానం ఇస్తున్నాడు. నాగ శౌర్యకు  గతంలో చెప్పుకోదగ్గ బ్రేక్ గా నిలిచిన ఊహలు గుసగుసలాడే దర్శకుడు అవసరాల శ్రీనివాస్ కు అదే మొదటి సినిమా. ఆ తర్వాత ఒకటి రెండూ ఫలితాలు శౌర్యకు ఆశించిన ఫలితాలు ఇవ్వలేకపోయినా తన నమ్మకం వమ్ము కాదని ఛలోతో వెంకీ కుడుముల నిరూపించాడు. పైగా తన దగ్గరకు వస్తున్న కొత్త దర్శకులు చెబుతున్న కథలు బాగా ఆకట్టుకుంటున్నాయని అందుకే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నానని క్లారిటీ ఇస్తున్నాడు. @నర్తనశాల 30 విడుదలకు అన్ని రెడీ చేసుకుంటోంది. శైలజారెడ్డి అల్లుడు రేస్ నుంచి తప్పుకునే  సంకేతాలు వస్తుండటం ప్లస్ గా మారొచ్చు. అధికారికంగా తెలియాల్సి ఉంది. ట్రైలర్ తో ఇప్పటికే వెరైటీ కాన్సెప్ట్ అని పేరు తెచ్చుకున్న @నర్తనశాల హిట్ అయితే  డెబ్యూ డైరెక్టర్స్ తో హ్యాట్రిక్ కు రంగం సిద్ధమైనట్టే.
Tags:    

Similar News