నాగబాబు మళ్లీ నిప్పులు.. ఈసారి దేనిమీదంటే?

Update: 2020-06-04 13:00 GMT
కరోనా వైరస్ ను పుట్టించి ప్రపంచాన్ని దెబ్బతీయడంతోపాటు సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరించి భారత్ ను కలవరపెడుతున్న చైనాకు బుద్ది చెప్పాలనే డిమాండ్ దేశంలో పెరిగిపోతోంది. ఇప్పటికే సోషల్ మీడియాలో చైనా వస్తువులు,యాప్ లు వాడొద్దంటూ పెద్ద ఎత్తున ప్రచారం మొదలైంది. చైనా వస్తువుల నుంచి సెల్ ఫోన్లు, చైనా యాప్స్ ను బ్యాన్ చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.

ఇదే నినాదంతో మెగా బ్రదర్ నాగబాబు ముందుకొచ్చాడు. భారత్ తో కయ్యానికి కాలుదువ్వుతున్న చైనాకు వ్యతిరేకంగా ఆసక్తికర ట్వీట్లు చేశారు.

తాజాగా నాగబాబు ట్వీ్ట్ చేస్తూ మన దేశాన్ని ఆక్రమించుకోవాలని చూస్తున్న చైనా వస్తువులు, సెల్ ఫోన్లు, మొబైల్ యాప్స్ ను బహిష్కరిద్ధాం అంటూ నాగబాబు పిలుపునిచ్చారు. మన దేశంలోనే తయారైన వస్తువులను కొందామని పేర్కొన్నారు. ప్రపంచంలోనే మనదేశం పెద్ద మార్కెట్ అని.. అన్ని దేశాల వస్తువులు ఇక్కడ అమ్మి సొమ్ము చేసుకొని లక్షల కోట్లు సంపాదిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

మన దేశ డబ్బుతో బాగుపడి మన దేశాన్ని ఆక్రమించుకోవడానికి చూస్తున్న చైనా వాళ్లు ఉత్పత్తి చేసిన వస్తువులను బ్యాన్ చేద్దామని నాగబాబు పేర్కొన్నారు. మన వస్తువులను కొంటే మన దేశంలోనే మన డబ్బు ఉంటుందని పిలుపునిచ్చాడు.

అయితే నాగబాబు ట్వీట్ పై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు సపోర్టు చేయగా.. మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. మీ కుటుంబ సభ్యులు చైనా యాప్ టిక్ టాక్ వాడడం మానేయమని చెప్పండి అంటూ విమర్శిస్తున్నారు.
Tags:    

Similar News