హీరోయిన్ తో వరుణ్ తేజ్ పెళ్లి.. నాగబాబు ఫన్నీ మీమ్ వైరల్..!

Update: 2021-04-05 10:30 GMT
మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియా మాధ్యమాల్లో చాలా యాక్టీవ్ గా ఉంటారనే సంగతి తెలిసిందే. అయితే ఈ మధ్య ఎక్కువగా ఇన్‌స్టాగ్రామ్ చిట్ చాట్‌ లో పాల్గొంటూ ఫాలోవర్స్ అడిగే ప్రశ్నలకు సమాధానమిస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా తన కెరీర్‌ కు సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత విశేషాలను కూడా పంచుకుంటుంటారు. కానీ అందరిలా అడిగిన దానికి డైరెక్ట్ ఆన్సర్ ఇవ్వకుండా.. మీమ్స్ వేసి మరీ సమాధానం ఇస్తున్నారు. ఇటీవల నాగబాబు మరోసారి ఇన్‌స్టాగ్రామ్ లో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ నిర్వహించి.. నెటిజన్లు అడిగే వాటికి తనదైన శైలిలో సమాధానాలు చెప్పాడు. ఈ సందర్భంగా తనయుడు వరుణ్ తేజ్ పెళ్లి గురించి ఓ నెటిజన్ అడిగాడు.

'వరుణ్ అన్న సాయి పల్లవికి పెళ్లి చేస్తా సార్.. జోడీ బాగుంటుంది' అని నాగబాబు ఇన్స్టాగ్రామ్ చిట్ చాట్ లో ఓ నెటిజన్ అన్నాడు. అయితే దీనికి 'జాతి రత్నాలు' సినిమాలోని ఫన్నీ క్లైమాక్స్ సీన్ వీడియోను పోస్ట్ చేశారు నాగబాబు. ఆ సినిమాలో నవీన్ పోలిశెట్టి 'నా కేసు నేనే వాదించుకుంటా యువరానర్' అనగా.. జడ్జ్ స్థానంలో ఉన్న బ్రహ్మానందం 'తీర్పు కూడా మీరే చెప్పుకోండిరా. నేనేందుకు ఇక్కడి నుంచి వెళ్లిపోతాలే' అని అంటారు. ఇప్పుడు నాగబాబు కూడా అదే పోస్ట్ చేశారు. తన కొడుకు వరుణ్ పెళ్లి మీరే చేస్తే ఇంక నేనెందుకు అనే ఉద్దేశ్యంలో నాగబాబు చేసిన ఫన్నీ మీమ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Tags:    

Similar News