డబ్బులు ఖర్చపెట్టొద్దన్న మెగా బ్రదర్‌

Update: 2016-07-24 09:56 GMT
పెద్ద పెద్ద హీరోలకు ఫ్యాన్సును చూసుకోవడానికి ఖచ్చితంగా తమ కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు ఉంటారు. సూపర్ స్టార్ రజనీకాంత్‌ విషయంలో ఫ్యాన్స్ తాలూకు మ్యాటర్లన్నీ ఆయన తమ్మడు సత్యనారాయణ చూసేవారట. ఇక మెగాస్టార్‌ చిరంజీవి విషయానికొస్తే.. ఇక్కడ కూడా ఆయన తమ్మడు నాగబాబు స్వయంగా ఫ్యాన్స్ మ్యాటర్లన్నీ చూస్తారనే విషయం తెలిసిందే.

అయితే ఈ మధ్యన అభిమానం హద్దులు దాటేయడంతో.. మన ఫ్యాన్సు ఉన్నారే.. సొంతంగా జేబుల్లోనుండి పైసల్ తీసి కటౌట్లు పెట్టడం.. దానధర్మాలూ.. హెల్త్ క్యాంపులూ.. అంటూ రచ్చ చేస్తున్నారు. మొన్నామధ్యన చరణ్‌ బర్తడే కు ఒక్కొక్కరూ వెయ్యి రూపాయలకు వేసుకుని.. లక్షల్లో ఖర్చుపెట్టారట. ఈ విషయాలన్నీ నాగబాబుకు తెలియడంతో ఆయన నిన్న జరిగిన ఫ్యాన్స్ మీట్ లో ఆగ్రహించారని తెలుస్తోంది. ఒక్కో ఫ్యాన్ అసోసియేషన్ కు పైనుండి అధిష్టానం పంపించే డబ్బుల్లోనే ఎలాంటి పండగైనా చేయాలి కాని.. సొంత జేబులో డబ్బులు తీయొద్దని క్లాసిచ్చారట. వచ్చే ఆగస్టు 22న మెగాస్టార్‌ చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆయన ఈ అదేశాలను జారీ చేశారటలే.

''అంతగా మీ దగ్గర డబ్బులున్నప్పుడు.. మీ ఫ్యామిలీ కోసం ఖర్చుపెట్టండి. మీ కోసం మీరు ఏదైనా చేసుకోండి. ఇలా మెగా హీరోల కోసం ఖర్చుపెట్టొద్దు. అది చూసుకోవడానికి మేమున్నాం కదా'' అన్నారట నాగబాబు. మంచి ఎడ్వయిజ్ ఇచ్చారు కదూ.
Tags:    

Similar News