మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ల మధ్య దూరం పెరిగినపుడు వాళ్లిద్దరికీ వారధిగా నిలిచిన వ్యక్తి నాగబాబు. అన్నతో, తమ్ముడితో ఆయనకు చాలా మంచి సంబంధాలున్నాయి. తాను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నపుడు ఆదుకున్నాడన్న అభిమానం పవన్ మీద ఎంతో ఉంది నాగబాబుకు. పవన్ కు సైతం నాగబాబుపై ఎంతో గౌరవం ఉంది. ఐతే పవన్ కళ్యాణ్ సొంతంగా పార్టీ పెడితే మాత్రం నాగబాబు అన్నయ్య పక్షానే నిలిచాడు. మెగా అభిమానులంతా కూడా అన్నయ్య వైపే ఉండాలన్నాడు. ఈ పిలుపు వల్ల నాగబాబుపై పవన్ అభిమానుల్లో వ్యతిరేక భావం ఏర్పడింది.
మరోవైపు మెగా హీరోలకు సంబంధించిన వేడుకల్లో పవర్ స్టార్ నినాదాల కారణంగా అందరూ ఇబ్బంది పడుతుండటంతో ఆ మధ్య నాగబాబుకు చిర్రెత్తుకొచ్చేసి పవన్ అభిమానుల మీద విరుచుకుపడ్డం తెలిసిందే. దీంతో పవన్ అభిమానుల్లో ఆయనపై వ్యతిరేకత మరింత పెరిగింది. నాగబాబు అప్పుడు ఆ పిలుపు ఇచ్చింది.. ఆ తర్వాత అరిచింది.. అన్నయ్య చిరు కోసమే. ఐతే ఆ చిరు ఇప్పుడు పవన్ తో బాగానే కలిసిపోయాడు. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఆడియో వేడుకకు కూడా ముఖ్య అతిథిగా వస్తున్నాడు. ఐతే మధ్యలో నాగబాబే ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటున్నాడు. నాగబాబు వైఖరి వల్లే ఆల్రెడీ వరుణ్ తేజ్ మీద కూడా పవన్ అభిమానుల్లో కొంత నెగెటివ్ ఇంపాక్ట్ పడింది. ఈ పరిస్థితుల్లో చిరు - పవన్ రీయూనియన్ అవుతుంటే.. నాగబాబు మాత్రం ఎక్కడా కనిపించడంలేదు. ఈ మధ్య నాగబాబు, పవన్ కలిసి కనిపించిన దాఖలాలే లేవు. మరి ‘సర్దార్..’ ఆడియో వేడుకలో ఆయన కనిపిస్తారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. ఆయన రాకపోతే మాత్రం ఆయనకు, పవన్ అభిమానులకు మధ్య అంతరం మరింత పెరుగుతుంది. అది మెగా ఫ్యామిలీకి అంత మంచిది కాదు.