కొత్త సినిమాలు ‘పరీక్ష’లో ఫెయిల్

Update: 2017-03-14 11:06 GMT
పోయినేడాది మార్చిలో ‘కళ్యాణ వైభోగమే’ అనే మంచి సినిమా వచ్చింది. ఆ చిత్రానికి చాలా మంచి రివ్యూలొచ్చాయి. మౌత్ టాక్ కూడా బాగానే ఉంది. కానీ సినిమాకు అంత మంచి వసూళ్లు మాత్రం రాలేదు. దీనికి కారణం ఆ చిత్రం అన్ సీజన్లో రిలీజ్ కావడమే. యావరేజ్ కంటెంట్ ఉన్న మంచు మనోజ్ సినిమా ‘శౌర్య’ అతడి కెరీర్లోనే బిగ్గెస్ట్ ఫ్లాపుల్లో ఒకటిగా నిలవడానికి కూడా అన్ సీజన్లో రిలీజ్ చేయడమే కారణం. ఈ ఏడాది కూడా మార్చి సినిమాల పరిస్థితి ఏమంత భిన్నంగా లేదు. ఈ నెలలో తొలి రెండు వారాంతాల్లోనే అరడజనుకు పైగా సినిమాలు రిలీజయ్యాయి. కానీ వాటిలో ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ మాత్రమే ఓ మోస్తరుగా వసూళ్లు సాధించింది. మిగతా సినిమాలేవీ కూడా బాక్సాఫీస్ దగ్గర నిలవలేకపోయాయి.

‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’తో పాటుగా రిలీజైన గుంటూరోడు.. ద్వారక బాక్సాఫీస్ దగ్గర చేదు ఫలితాన్ని ఎదుర్కొన్నాయి. ఇక పోయిన వారం వచ్చిన సినిమాల్లో ఒక్క ‘నగరం’ మాత్రమే పర్వాలేదనిపిస్తోంది. ఐతే ఈ సినిమాకు ఫుల్ పాజిటివ్ రివ్యూలు వచ్చినా సరే.. దానికి తగ్గట్లుగా వసూళ్లు లేవు. ఉన్నంతలో మెరుగనిపిస్తోందంటే. మరో తమిళ డబ్బింగ్ మూవీ ‘16’కు కూడా పాజిటివ్ రివ్యూలు వచ్చినా కలెక్షన్లు లేవు. ఇక తెలుగు సినిమాలు చిత్రాంగద.. లక్ష్మీబాంబు.. ఆకతాయిల గురించి చెప్పడానికేమీ లేదు. ఈ సినిమాల గురించి డిస్కషనే లేదు. వసూళ్లు దారుణంగా ఉన్నాయి. మామూలు రోజుల్లో వచ్చి ఉంటే ఈ సినిమాలు ఓ మోస్తరు వసూళ్లయినా తెచ్చుకునేవి. కానీ అన్ సీజన్లో రిలీజ్ చేయడం వల్ల.. ఏదో రిలీజ్ అయ్యాయంటే అయ్యాయి అన్నట్లుంది పరిస్థితి. ఈ వీకెండ్లో రాబోయే కొత్త సినిమాలు ‘వెళ్లిపోమాకే’.. ‘మా అబ్బాయి’.. ‘శివలింగా’లకు కూడా పరిస్థితులు ఏమంత అనుకూలంగా లేవు. ‘కాటమరాయుడు’ వచ్చాక కానీ బాక్సాఫీస్ జోరందుకునే అవకాశాలు కనిపించడం లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News