కొంతమంది నోటి మాటకు ఉండే పవర్ ఎలాంటిదో.. అందరికి తెలిసేలా చేశారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కమ్ రాష్ట్ర మంత్రి కేటీఆర్. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ తర్వాత అత్యంత పవర్ ఫుల్ అయిన కేటీఆర్ కు.. ఈ మధ్యన చేనేత మీద మనసైంది. అందరూ చేనేత వస్త్రాల్ని ధరించాలని ఆయన పిలుపునిచ్చారు. చేనేతకు చేయూతనివ్వాలంటూ ఈ మధ్యన ట్విట్టర్ లో కోరిన కేటీఆర్ అందులో భాగంగా కొందరి ప్రముఖుల పేర్లను ప్రస్తావించారు.
ఆ లిస్ట్ లో అగ్ర నటులు కమల్ హాసన్.. నాగార్జున.. మహేశ్ బాబు తదితరులను చేనేత వస్త్రాల్ని ధరించాలని కోరారు. ‘నేను చేనేత వస్త్రాల్ని ధరిస్తున్నా? మరి.. మీరు?’’ అంటూ ఆయన చేసిన ట్వీట్ కు పెద్దగా స్పందన రాలేదని చెప్పాలి. ఆ కొరతను తాజాగా తీర్చారు ప్రముఖ నటులు నాగార్జున. చేనేత వస్త్రాల్ని ధరించాలని కోరిన కేటీఆర్ కోరికను కాదని నాగ్.. తనతో పాటు.. తన వైఫ్ అమలతో కలిసి కాటన్ వస్త్రాలుధరించి ఫోటో దిగారు.
దాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. చేనేత వస్త్రాలు చాలా నచ్చాయని.. అందంగా ఉండటమే కాదు.. సౌకర్యవంతంగా కూడా ఉన్నాయని.. తాను చేనేత రంగానికి పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. తన మాటకు స్పందించిన నాగ్ కు కేటీఆర్ ట్వీట్ తో థ్యాంక్స్ చెప్పేశారు. అంతేకాదు.. నాగ్.. అమల జంట ఫోటో పలువురికి స్ఫూర్తిని రగిలిస్తుందన్న ఆశాభావాన్నివ్యక్తం చేశారు. అయనా.. కేటీఆర్ అడిగితే నాగ్ కాదనగలరా?