టాలీవుడ్లో ఒక్కసారిగా మల్టీస్టారర్ ట్రెండు ఊపందుకున్నట్లుగా ఉంది. ఈ మధ్య కాలంలో నాలుగైదు మల్టీస్టారర్ల గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. వాటిలో ఏవి మెటీరియలైజ్ అవుతాయన్నది ఇంకా స్పష్టత లేదు. సమీప భవిష్యత్తులో సెట్స్ మీదికి వెళ్లడానికి అవకాశమున్న మల్టీస్టారర్ అయితే.. నాగార్జున-నాని కాంబినేషన్లో రాబోయేదే. ఈ చిత్రం ఫిబ్రవరిలో సెట్స్ మీదికి వెళ్తుందని వార్తలొచ్చాయి. ఈ సినిమా గురించి.. ఇటు నాగ్.. అటు నాని వేర్వేరుగా స్పందించారు. నాగ్ ఈ మల్టీస్టారర్ విషయంలో కొంచెం స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేయగా.. నాని మాత్రం కొంచెం సందేహాలు రేకెత్తించేలా మాట్లాడటం విశేషం.
‘హలో’ ప్రమోషన్లలో భాగంగా మీడియాను కలిసిన నాగ్.. నానితో మల్టీస్టారర్ సినిమా చేయబోతున్న విషయం వాస్తవమే అన్నాడు. యువ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య తనకు ఈ కథను నరేట్ చేసిన విధానం తనకెంతగానో నచ్చిందని నాగ్ చెప్పాడు. లైన్ విని ఇంప్రెస్ అయిన తాను.. పూర్తి స్క్రిప్టు రెడీ చేసుకుని రమ్మని చెప్పానని.. ఫిబ్రవరిలోనే ఈ సినిమా మొదలు కావచ్చని.. నానితో కలిసి సినిమా చేయడం హ్యాపీ అని నాగ్ అన్నాడు. మరోవైపు ‘ఎంసీఏ’ ప్రమోషన్లలో ఉన్న నానిని ఈ సినిమా గురించి అడిగితే.. ఇప్పుడే ఈ సినిమా గురించి మాట్లాడలేనని అన్నాడు. ఈ సినిమా చర్చలు ఇంకా పూర్తి కాలేదని.. సినిమా ఫైనలైజ్ అయ్యాక అప్పుడు దీని గురించి తాను ప్రకటన చేస్తానని అన్నాడు. అంతకుమించి నాని ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం విశేషం.