కింగ్ అక్కినేని నాగార్జున - యువసామ్రాట్ నాగ చైతన్య కలిసి నటించిన తాజా చిత్రం ''బంగార్రాజు''. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని సంక్రాంతి సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇది వరకే ప్రకటించారు.
అయితే 'బంగార్రాజు' సినిమాని పండక్కి తీసుకొస్తామని చిత్ర బృందం ఎప్పటి నుంచో చెప్తున్నా.. విడుదల తేదీని అనౌన్స్ చేయకపోవడంతో రకరకాల ఊహాగానాలు వినిపించాయి. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించి జనవరి 14న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు.
ఈ సందర్భంగా బుధవారం సినిమాలోని 'బంగారా' అనే పాటకు సంబంధించిన ప్రోమోను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇప్పటికే 'బంగార్రాజు' సినిమా నుంచి వచ్చిన సాంగ్స్ - టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో రాబోయే రోజుల్లో శరవేగంగా ప్రమోషన్స్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
బ్లాక్ బస్టర్ 'సోగ్గాడే చిన్నినాయనా' చిత్రానికి సీక్వెల్ గా ''బంగార్రాజు'' రూపొందింది. ఇందులో నాగార్జున సరసన రమ్యకృష్ణ.. నాగచైతన్య కు జోడీగా కృతి శెట్టి కథానాయికలుగా నటించారు. సత్యానంద్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించగా.. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చారు. జీ స్టూడియోస్ సమర్పణలో అన్నపూర్ణ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మించారు.
'మనం' తర్వాత అక్కినేని తండ్రీకొడుకులు కలిసి నటించిన సినిమా కావటంతో 'బంగార్రాజు' చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. అందులోనూ సంక్రాంతి రేసులో పోటీగా పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో ఈసారి విన్నర్ బంగార్రాజే అని సినీ అభిమానులు భావిస్తున్నారు.
ఇదిలా ఉండగా 'బంగార్రాజు' ప్రెస్ మీట్ లో ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ ధరల అంశంపై నాగార్జున కీలక వ్యాఖ్యలు చేశారు. విలేఖరులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. ''సినిమా స్టేజిపై పొలిటిక్స్ గురించి మాట్లాడకూడదు.. నేను మాట్లాడను.. అయినా టికెట్స్ రేట్స్ వలన నా సినిమాకి అయితే ఇబ్బంది లేదు'' అని నాగార్జున అన్నారు. నాగ్ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.