నటుడు నాగార్జున ఇప్పుడు ఒకే సమయంలో రెండు సంతోషాలను ఆస్వాదిస్తున్నాడు. మొదటిది కొడుకు నాగచైతన్య పెళ్లి చేసి కోడలిని ఇంటికి తెచ్చుకోవడం. రెండోది తాను చేసిన సినిమా హిట్ కావడం. రెండు రోజుల పాటు గోవాలో జరిగిన సమంత - నాగచైతన్యల పెళ్లితో మొదటి సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకున్నాడు. తాజాగా రాజుగారి గది-2 సక్సెస్ ను సెలబ్రేట్ చేసుకున్నానని అంటున్నాడు.
రాజుగారి గది సినిమాతో డీసెంట్ హిట్ కొట్టిన డైరెక్టర్ ఓంకార్ రెండో పార్ట్ ను భారీ స్టార్ కాస్టింగ్ తో తీశాడు. హీరో నాగార్జున కెరీర్ లో తొలిసారి హర్రర్ కామెడీ జోనర్ లో నటించాడు. ‘‘రాజుగారిగది-2 సినిమా బాగుందనే టాక్ అన్నివైపుల నుంచి వినిపిస్తోంది. ముఖ్యంగా నా ఫ్యాన్స్ ఈ సినిమా సక్సెస్ తో చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ల ముఖాల్లో ఆనందం కనిపించింది. రెండు బీర్లు తాగి.. బిర్యానీ తిని వాళ్ల సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకున్నా’’ అంటూ తాజాగా సినిమా సక్సెస్ మీట్ లో నాగ్ చెప్పాడు.
రాజుగారి గది-2 సినిమా అవుట్ పుట్ అనుకున్న స్థాయిలో రాకపోవడంతో నాగార్జున ఒకానొక టైంలో తీవ్ర అసంతృప్తికి గురయ్యాడనేది అతడి సన్నిహితులు చెబుతున్న మాట. దాంతో రీ షూట్లకు వెళ్లాల్సి వచ్చింది. ఓంకార్ ఫస్ట్ రిలీజ్ చేసిన ట్రయిలర్ కూడా నచ్చలేదనే విషయం బహిరంగంగానే చెప్పాడు. దానికితోడు ఓవర్సీస్ లో సినిమా ప్రమోషన్ చేసే ప్రయత్నమే చేయలేదు. కానీ రాజుగారి గది-2 ప్రేక్షకులను ఆకట్టుకుండటంతో సెలబ్రేషన్ అనే మాటతో తనలోని సందేహాలన్నీ తీరిపోయాయని చెప్పకనే చెప్పాడు. కాని ట్రేడ్ వర్గాలు మాత్రం.. ఇక్కడ ఇండియాలో సినిమా ఓకేగా సాగుతున్నా కూడా.. అమెరికాలో మాత్రం పెద్దగా ఎక్కడం లేదు అంటున్నారు. కలక్షన్లే అందుకు సాక్ష్యం అంటూ చెబుతున్నారు. అది సంగతి.