నాగార్జున కొత్త సినిమా ‘సోగ్గాడే చిన్ని నాయనా’ ఈ ఏడాది ఫస్ట్ క్వార్టర్ లో మొదలైంది. నాలుగు నెలల్లో షూటింగ్ పూర్తి చేసేయాలని ప్లాన్ చేసుకున్నాడు నాగార్జున. కానీ ఇప్పటికీ సినిమా పూర్తి కాలేదు. మొదట్లో ఓ మూణ్నెల్ల పాటు శరవేగంగా షూటింగ్ జరిగింది. హైదరాబాద్ తో పాటు మైసూర్ లో షూటింగ్ జరిపారు. ఇక సినిమా అయిపోతుందనగా.. సడెన్ గా వార్తల్లో లేకుండా పోయాడు సోగ్గాడు. ఆ టైంలో సినిమా గురించి రకరకాల రూమర్లు వినిపించాయి. కొత్త దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కథ చెప్పిన స్థాయిలో సినిమా తీయలేకపోయాడని.. ఔట్ పుట్ పట్ల నాగ్ అసంతృప్తిగా ఉన్నాడని ఊహాగానాలు వచ్చాయి. దీని గురించి యూనిట్ సభ్యులెవరూ స్పందించకపోవడంతో వాస్తవమేంటో ఎవరికీ అర్థం కాలేదు.
ఇంతలో ఈ మధ్యే సోగ్గాడు లాస్ట్ షెడ్యూల్ మొదలైంది. పూర్తయ్యే వరకు ఆపేది లేదంటూ ప్రకటించాడు నాగ్. ఈ రోజు నాగ్ బర్త్ డే సందర్భంగా ‘సోగ్గాడే చిన్ని నాయనా’ టీజర్ రిలీజై జనాల్ని ఆకట్టుకుంది. ఈ సందర్భంగా నాగ్ ను మధ్యలో జరిగిన మరమ్మతుల గురించి అడిగితే.. ఇన్ డైరెక్టుగా ఆ సంగతి ఒప్పేసుకున్నాడు. ‘‘స్క్రీన్ ప్లే విషయంలో కొంతమంది కొత్త రచయితలు సలహాలు, సూచనలు తీసుకున్నాం. అదంతా థర్డ్ ఒపీనియన్ తీసుకోవడంలో భాగమే. సాయిమాధవ్ బుర్రా కూడా వచ్చి మా బృందంలో చేరాడు. సినిమాలో కొంత భాగం లెంగ్తీగా, డ్రాగింగ్ గా అనిపించింది. దీంతో కథను మరింత ఎఫెక్టివ్ గా చెప్పడానికే సాయిమాధవ్, ఇతర రచయితలు సహకారం తీసుకున్నాం. మేం అనుకున్నట్లే స్క్రిప్టు మరింత బాగా తయారైంది’’ అని చెప్పాడు నాగార్జున.