నాగ్‌ 'ఆఫీసర్‌'ను మర్చిపోలేక పోతున్నాడా?

Update: 2020-12-22 11:51 GMT
నాగార్జున కు ట్రెండ్‌ సెట్టర్‌ మూవీని ఇచ్చిన రామ్ గోపాల్ వర్మ 2018 సంవత్సరంలో 'ఆఫీసర్‌' సినిమాను ఇచ్చిన విషయం తెల్సిందే. అంతకు ముందు వరుసగా చిన్న చితకా సినిమాలు చేస్తే ప్లాప్‌ అవుతున్నా కూడా రామ్‌ గోపాల్‌ వర్మను నమ్మి నాగార్జున ఆఫీసర్ సినిమాను తీశాడు. ఇది మరో ట్రెండ్‌ సెట్టర్‌ మూవీ అవుతుందని నాగార్జున చాలా ఆశ పడ్డాడు. కాని ఆయన ఆశలన్నీ అడియాశలు అయ్యాయి. ఇలాంటి సినిమాలో ఎలా నటించారు అంటూ నాగ్ ను స్వయంగా అభిమానులు ప్రశ్నించారు. వర్మ వైపు మళ్లీ చూడాలన్నా కూడా భయపడేలా ఆ సినిమా చేసిందంటూ నాగ్ సన్నిహితుల వద్ద అన్నాడట. తాజాగా అదే విషయం నాగ్ కు గుర్తకు వచ్చినట్లుంది.

విషయం ఏంటీ అంటే ఆదివారం జరిగిన బిబి4 ఫినాలే ఎపిసోడ్‌ లో భాగంగా మాజీ కంటెస్టెంట్స్‌ తో నాగార్జున మాట్లాడాడు. ఆ సందర్బంగా స్వాతితో మాట్లాడుతూ గోవా వెళ్లినట్లున్నావుగా అన్నాడు. ఆమె కాస్త సిగ్గు పడింది. ఆ తర్వాత వర్మ గారి దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్నాను అంటూ చాలా సంతోషంగా చెప్పింది. అప్పుడు నాగ్‌ కాస్త జాగ్రత్త అంటూ తనదైన శైలిలో నవ్వు నవ్వేశాడు. ఆ జాగ్రత్త ఎందుకు అనేది స్వాతితో పాటు అందరు కూడా ఆలోచనల్లో పడేసింది. వర్మ సినిమాలో చేస్తున్న అనగానే నాగార్జునకు ఆఫీసర్ గుర్తుకు వచ్చిందేమో అందుకే జాగ్రత్త అని ఉంటాడు అంటూ నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
Tags:    

Similar News