నాగార్జునను వర్మ అలా చూపిస్తాడట..

Update: 2017-11-07 10:21 GMT
సినిమాల ఎంపికలో అప్పుడప్పుడూ భలే షాకులిస్తుంటాడు అక్కినేని నాగార్జున. ఓంకార్ లాంటి చిన్న దర్శకుడికి అలాగే అవకాశమిచ్చి ఆశ్చర్యపరిచాడు నాగ్. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మతో సినిమా చేసేందుకు అంగీకరించడం కూడా పెద్ద షాకే. వీళ్లిద్దరి కాంబినేషన్లో ‘శివ’ లాంటి మైల్ స్టోన్ మూవీ వచ్చి ఉండొచ్చు గాక.. కానీ గత దశాబ్ద కాలంలో వర్మ ట్రాక్ రికార్డు ఏంటన్నది అందరికీ తెలిసిందే. అయినా నాగ్ వర్మకు ఛాన్సిచ్చాడు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి వర్మ కొంచెం గట్టిగానే శ్రమిస్తున్నట్లు సమాచారం. నాగ్ పాత్రను చాలా ప్రత్యేకంగా తీర్చిదిద్దాడట వర్మ.

తాను కానీ.. నాగ్ కానీ.. ఇలాంటి సినిమా ఇంతకుముందెన్నడూ చేయలేదని వర్మ చెప్పిన సంగతి తెలిసిందే. నాగ్‌ పాత్ర.. ఆయన లుక్ కూడా నెవర్ బిఫోర్ అన్నట్లు ఉండేలా వర్మ చూసుకుంటున్నాడట. అందుకోసం నాగార్జునను బాగానే కష్టపెట్టిస్తున్నాడట వర్మ. ఈ సినిమా కోసం కండలు పెంచి.. టఫ్ కాప్ లుక్ లోకి మారేందుకు నాగ్ కష్టపడుతున్నాడట. మామూలుగానే నాగ్ ఫిట్నెస్ ఫ్రీక్. 60 ఏళ్లకు దగ్గరపడుతూ కూడా అలా ఎంత మాత్రం కనిపించడు నాగ్. ఫిట్నెస్ విషయంలో టాలీవుడ్ లో ఎందరికో నాగ్ స్ఫూర్తి. మామూలుగానే జిమ్ లో బాగా కష్టపడే నాగ్.. వర్మ సినిమా కోసం మరింత ఎక్కువ సమయంలో కసరత్తులు చేస్తున్నాడట. దాదాపుగా సిక్స్ ప్యాక్ లుక్ లోకి నాగ్ మారతాడని సమాచారం. నాగ్-వర్మ సినిమా ఈ నెల 20న సెట్స్ మీదికి వెళ్లబోతున్న సంగతి తెలిసిందే.

Tags:    

Similar News