‘మీలో ఎవరు కోటీశ్వరుడు’లో ఎన్టీఆర్.. గత మూణ్నాలుగు రోజులుగా టాలీవుడ్ లో ఇదే హాట్ టాపిక్. మామూలుగానే ఈ షో ఎప్పుడూ చర్చనీయాంశమే. పైగా ఎన్టీఆర్ రాకతో ఆ షోకు మరింత కళ వచ్చింది. ఎన్టీఆర్ - నాగ్ కలయిక అందరిలో ఆసక్తి రేపింది. జూనియర్ తో నాగ్ ముచ్చట్ల గురించి చాలా చర్చ జరిగింది. ఈ ఎపిసోడ్ గురించి నాగ్ కూడా ఓ మీడియా సంస్థతో మాట్లాడాడు.
ఎన్టీఆర్ తో ఎపిసోడ్ చేయడం చాలా మంచి అనుభూతి అని చెప్పాడు నాగ్. ఈ ఎసిపోడ్ ను తాను చాలా బాగా ఎంజాయ్ చేశానని నాగ్ తెలిపాడు. ‘‘ఎన్టీఆర్ రావడంతో ఆ ఎపిసోడ్ చాలా సరదాగా సాగిపోయింది. మొత్తంగా ఈ ఎపిసోడ్ అనుభవాన్ని చాలా ఆస్వాదించాను. ఎన్టీఆర్ నాకు చాలా కాలం నుంచి తెలుసు. అతడి తండ్రి హరికృష్ణ నాకు చాలా క్లోజ్. ఎన్టీఆర్ షోకు వచ్చాడంటే.. నా ఫ్యామిలీ మెంబర్ వచ్చినట్లే ఫీలయ్యా’’ అని నాగ్ తెలిపాడు.
ఈ ఎపిసోడ్ లో ఎన్టీఆర్ ఎంత డబ్బు గెలుచుకున్నాడనే విషయంలో రకరకాల ఊహాగానాలున్నాయి. ఎపిసోడ్ ప్రోమోలో అయితే అతను రూ.12.5 లక్షల ప్రశ్నకు జవాబిచ్చినట్లుగా చూపించారు. మరి ఇంతకీ ఎన్టీఆర్ ఎంత సంపాదించాడు అని నాగ్ ను అడిగితే.. ‘‘ఎన్టీఆర్ పెద్ద మొత్తంలోనే గెలిచాడు. అది ఎంత అన్నది ఎపిసోడ్ చూసి తెలుసుకోండి’’ అంటూ సమాధానం దాటవేశాడు నాగ్.