నాగ్‌ నుండి మరోటి.. ఇంకా ఎన్ని బాసూ?

Update: 2018-11-20 01:30 GMT
అక్కినేని నాగార్జున ఒక వైపు హీరోగా నటిస్తూనే మరో వైపు పెద్ద, చిన్న చిత్రాలను నిర్మిస్తూ వస్తున్నాడు. ఎక్కువగా సొంత చిత్రాలనే నిర్మిస్తున్న అన్నపూర్ణ స్టూడియోస్‌ బయట చిత్రాలపై మాత్రం ఆసక్తి చూపడం లేదు. అన్నపూర్ణ స్టూడియో బ్యానర్‌ ఉండగానే నాగార్జున మనం ఎంటర్‌ ప్రైజెస్‌ బ్యానర్‌ ను కూడా స్థాపించిన విషయం తెల్సిందే. ‘మనం’ సినిమా అక్కినేని కుటుంబంకు ఎప్పటికి గుర్తుండి పోయే సినిమా కనుక, ఆ సినిమా పేరు మీద మనం ఎంటర్‌ ప్రైజెస్‌ స్థాపించి ఉంటాడు అనుకున్నాం. కాని ఇప్పుడు నాగార్జున నుండి మరో బ్యానర్‌ రాబోతుందట.

సినీ వర్గాల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం నాగార్జున కొత్త నిర్మాణ సంస్థను ప్రారంభించబోతున్నాడట. ఆ బ్యానర్‌ లో అన్ని కూడా చిన్న బడ్జెట్‌ చిత్రాలు మాత్రమే తెరకెక్కబోతున్నాయట. అయిదు కోట్ల లోపు బడ్జెట్‌ చిత్రాలను వరుసగా కొత్త బ్యానర్‌ లో తెరకెక్కించేందుకు నాగార్జున ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

కొత్త నటీనటులు మరియు సాంకేతిక నిపుణులను కొత్త బ్యానర్‌ లో పరిచయం చేయాలనే ఉద్దేశ్యంతో నాగార్జున ఉన్నట్లుగా కూడా సమాచారం అందుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్‌ యాక్టింగ్‌ స్కూల్‌ స్టూడెంట్స్‌ కు కూడా ఇదో మంచి అవకాశం అన్నట్లుగా నాగార్జున సన్నిహితులు చెబుతున్నారు. త్వరలోనే కొత్త బ్యానర్‌ గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే రెండు బ్యానర్‌ లు ఉండగా మళ్లీ మూడవ బ్యానర్‌ ఎందుకు బాసూ అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. ఎవరి లెక్కలు వారికి ఉంటాయి, నాగార్జున మైండ్‌ లో ఎలాంటి లెక్కలు ఉన్నాయో ఎవరికి తెలుసు..?

Tags:    

Similar News