తన సుదీర్ఘ కెరీర్ లో నాగార్జున ఇప్పటి వరకు ఎన్నో ప్రాతల్లో నటించాడు. ఎన్నో సార్లు ప్రయోగాత్మకంగా సినిమాలు చేసి సక్సెస్ లు దక్కించుకున్నాడు. మన్మధుడు ఇమేజ్ ఉన్న నాగార్జున అన్నమయ్య వంటి భక్తిరస చిత్రాన్ని కూడా చేసి మెప్పించాడు. అన్ని పాత్రలను అద్బుతంగా పోషించగల సత్తా ఉన్న నాగార్జున తాజాగా విలక్షణ దర్శకుడు ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో సినిమాను చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే విషయం తెల్సిందే. ఆ సినిమా కథ ఏంటీ అందులో నాగ్ ఏ పాత్రలో కనిపించబోతున్నాడు అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది.
మొన్నటి వరకు సెక్యూరిటీ ఆఫీసర్ గా నాగార్జున కనిపిస్తాడనే వార్తలు వచ్చాయి. కాని ప్రవీణ్ సత్తారు సన్నిహితుల నుండి ఈ సినిమాలో నాగ్ రైతు పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఒక రైతు కూతురు తప్పిపోతుంది. ఆ సమయంలో ఒక సామాన్యమైన ఆ రైతు తన కూతురును ఎలా కనిపెట్టాడు, అందుకోసం ఎంతటి సాహసాన్ని చేశాడు అనేది కథాంశంగా చెబుతున్నారు. ఈ కథలో రైతు పాత్రను నాగార్జున పోషించనున్నాడట.
ఒక పాపకు తండ్రి పాత్రలో నాగార్జున నటించబోతున్నాడు. ఇప్పటి వరకు కెరీర్ లో ఎప్పుడు కూడా నాగార్జున కనిపించని పాత్రలో కనిపించబోతున్నాడు. ప్రస్తుతం చేస్తున్న వైల్డ్ డాగ్ చిత్రం షూటింగ్ పూర్తి అయిన తర్వాత ప్రవీణ్ సత్తారు మూవీలో నాగ్ నటించే అవకాశం ఉందంటున్నారు. తమిళంలో నాన్ రుద్రన్ చిత్రంలో ఇంకా హిందీలో ఒక సినిమాలో కూడా నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నాడు. మన్మధుడు 2 చిత్రం తర్వాత నాగ్ కథల ఎంపిక విషయంలో చాలా మార్పు కనిపిస్తుంది.