తెలుగు సినిమా ఈ ఏడాది మంచి విజయాలనే తన ఖాతాలో వేసుకొంది. సంక్రాంతికి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఖైదీ 150 నుండి ఇప్పటి ఫిదా వరకు కొన్ని హిట్లు కొన్ని మంచి సినిమాలతో పాటుగా బాహుబలి లాంటి గొప్ప సినిమాలతో బాగనే నడిచింది. మరో రానున్న నాలుగు నెలలు కూడా అలానే సాగనుంది. అయితే తమిళనాడులో ఈ ఏడాది వాళ్ళు ఊహించుకున్నంతగా బాక్స్ ఆఫీసు వద్ద ఏ సినిమా కూడా కలెక్షన్లు చేయలేకపోయింది. కథ పెద్దగా ఏమి లేకుండా హీరోని గొప్పగా చూపించడం అది ప్రేక్షకులకు అంతగా నచ్చకపోవడం లాంటివి జరుగుతూ వచ్చాయి. కానీ ఈ మధ్య వచ్చిన ‘విక్రమ్ వేధ’ అందరి అంచనాలుకు మించి కలెక్షన్లు రాబట్టింది.
ఈ తమిళ్ సినిమా విక్రమ్ వేధలో హీరో ఆర్ మాధవన్ - మాస్ హీరో విజయ్ సేతుపతి నటించారు. పుష్కర్ మరియు గాయత్రీ కలిసి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి ఒక గ్యాంగ్ స్టార్ గా నటిస్తే మాధవన్ ఏమో ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ ఆఫీసర్ గా నటించాడు. ఈ సినిమాను తమిళనాడు ప్రేక్షకలు సూపర్ హిట్ చేశారు. అయితే ఇదే సినిమాను తెలుగులో రీమేక్ చేస్తునట్లు అందులో విక్టరీ వెంకటేష్ - యంగ్ హీరో రానా నటించబోతోన్నారు అని ఒక టాక్ వచ్చింది. కానీ ఇప్పుడు అ సినిమా నిర్మాణ సంస్థ నుండి అందిన ఇన్ ఫర్మేషన్ ప్రకారం హీరో నాగార్జున ఇందులో నటించబోతోన్నట్లు తెలుస్తోంది.
విక్రమ్ వేధ నిర్మాత శశి కాంత్ ఇప్పటికే నాగార్జున ను గ్యాంగ్ స్టార్ రోల్ కోసం అడిగినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే నాగ్ అ రోల్ చేస్తే పోలీసు ఆఫీసర్ గా ఎవరు చేస్తారు అనే ఆలోచన వచ్చింది మళ్ళీ అ సంస్థకే. అక్కడ చర్చలు బట్టి చూస్తుంటే మళ్ళీ తెలుగులో కూడా ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ ఆఫీసర్ గా ఆర్ మాధవన్ నే చేయబోతున్నాడు అని చెబుతున్నారు. అదే జరిగితే నాగ్ మళ్ళీ ఊపిరి సినిమా తరువాత మరో మల్టీ స్టార్ సినిమాలో కనిపించబోతోన్నాడు అనమాట. విక్రమ్ వేధ సినిమా మేకింగ్ స్టైల్ కానీ స్క్రీన్ ప్లే కానీ కొత్తగా ఉండటంతో ఈ సినిమాను నాగ్ చేస్తే ఈ సినిమాకు తమిళనాడులో కంటే కూడా తెలుగులో మంచి కమర్షియల్ హిట్ అవుతుంది అని ట్రేడ్ నిపుణుల అంచనా!!