చేసినదే ఒక్క సినిమా. అది కూడా గుర్తుంచుకోవాలని అనుకునేది కాదు. అలా ఒకే ఒక్క మూవీ ఎక్స్ పీరియన్స్ తో రెండో సినిమా యాక్సెప్ట్ చేయడానికే ఏడాది టైమ్ తీసుకున్న అక్కినేని అఖిల్.. లైఫ్ లో మాత్రం చాలా స్పీడ్ చూపించేస్తున్నాడు. పారిశ్రామికవేత్త జీవీకే రెడ్డి మనవరాలు శ్రేయా భూపాల్ తో అఖిల్ ప్రేమ.. ఇప్పుడు ఎంగేజ్మెంట్ వరకూ వరకూ వచ్చేసింది.
డిసెంబర్ 9న అఖిల్-శ్రేయాల నిశ్చితార్ధం జరగనుంది. పెళ్లి ఎలాగూ డెస్టినేషన్ వెడ్డింగ్ కాబట్టి.. ఎంగేజ్మెంట్ గ్రాండ్ గా చేస్తారని భావిస్తే.. నాగ్ మాత్రం దీన్ని ఫ్యామిలీ ఈవెంట్ గానే నిర్వహిస్తున్నారు. ఇరు కుటుంబాల సభ్యులతో పాటు.. అత్యంత సన్నిహితులను మాత్రమే పిలుస్తున్నారట. ముఖ్యంగా టాలీవుడ్ సినిమా జనాలను కూడా చాలామందిని దూరం పెట్టేస్తున్నారని తెలుస్తోంది. ఇందుకు కారణం తెలీదు కానీ.. మెగాస్టార్ చిరంజీవి ఒక్కరికే నాగ్ నుంచి ఆహ్వానం అందిందట. కనీసం చిరు ఫ్యామిలీలో మిగిలిన హీరోలెవరికీ పిలుపు కూడా లేదని తెలుస్తోంది.
అయితే.. పెళ్లి తర్వాత రిసెప్షన్ ని మాత్రం టాలీవుడ్ తో పాటు అందరికీ ఇన్విటేషన్లు ఉంటాయని తెలుస్తోంది. వచ్చే ఏడాది మే నెలలో ఈ రిసెప్షన్ ఉండే ఛాన్స్ ఉంది. ఇక అఖిల్ సినిమా విషయానికొస్తే మనం ఫేమ్ విక్రమ్ కె కుమార్ తో మూవీని.. జనవరి నుంచి మొదలుపెట్టబోతున్నాడు అఖిల్ అక్కినేని.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/