పేరుతో మొదలయ్యే సినిమాలు ఇటీవల చాలా అరుదు. కథ సిద్ధం చేసుకొన్నాక ఏదో ఒకటి వర్కింగ్ టైటిల్ గా అనేసు కొని సినిమా మొదలుపెడుతుంటారు. ఫైనల్ ఔట్ పుట్ చూసుకొన్నా పేరు గురించి ఆలోచిస్తుంటారు. ఆ లోపు అభిమానులు, పరిశ్రమ రెండు మూడు పేర్లను ప్రచారంలోకి తీసుకొస్తుంటాయి. చివరికి యూనిట్ అనుకొన్న పేరే ఫిక్సయిపోతుంటుంది. మధ్యలో వచ్చిన పేర్లు వేరే కథానాయకుల సినిమాలకో ఖరారవుతుంటాయి. ఇలాంటి పరిస్థితుల్ని నిత్యం ఇండస్ట్రీలో చూస్తూనే ఉన్నాం. నాగార్జున, కార్తీ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ సినిమాకి ఆమధ్య `మిత్రులు` అనే పేరు పరిశీలనలో ఉందని చెప్పుకొన్నారు. కానీ చిత్రబృందం మాత్రం ఏ విషయం బయటపెట్టలేదు. ఇప్పుడు మరో పేరు ప్రచారంలోకి వచ్చింది. అదే.. `ఊపిరి`.
ఫ్రెంచ్ లో విడుదలై విజయవంతమైన `ఇన్ టచబుల్స్` అనే సినిమా ఆధారంగా నాగ్, కార్తీల సినిమా తెరకెక్కుతోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. హిల్లేరియస్ గా సాగే ఈ కథలో మనసుకు హత్తుకొనే భావోద్వేగాలు, ట్విస్టులు కూడా ఉంటాయట. అవి నచ్చే నాగ్ ఒప్పుకొన్నట్టు తెలుస్తోంది. అన్నట్టు నాగార్జున దాదాపుగా స్ట్రెచర్ పై కూర్చునే కనిపిస్తారట. కానీ ఈ సినిమా అందరికీ నచ్చేలా ఉంటుందని ఆయన చెబుతున్నాడు. కార్తీ సరసన తమన్నా నటిస్తుండగా, నాగ్ సరసన గాబ్రియోలా అనే మోడల్ నటిస్తోంది. డిసెంబరులో కానీ, సంక్రాంతికి గానీ ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశాలున్నాయి. పీవీపీ సంస్థ భారీ వ్యయంతో రూపొందిస్తున్న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళంలోనూ విడుదల కాబోతోంది. ఇండస్ట్రీలో మరో ట్రెండ్ ని సృష్టించే చిత్రమవుతుందని కథ గురించి తెలిసినవాళ్లు చెబుతున్నారు.