ప్రస్తుతం అటు అమెరికాలో.. ఇటు ఇండియాలో డొనాల్డ్ ట్రంప్ పేరెత్తితే జనాలు మంటెత్తి పోతున్నారు. కొంతమంది ట్రంప్ కు మద్దతు పలుకుతున్నప్పటికీ.. మెజారిటీ జనాలు ఆయన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ట్రంప్ తనకు స్ఫూర్తి అంటున్నాడు అక్కినేని నాగార్జున. ఇంతకీ ఏ విషయంలో ట్రంప్ నాగార్జునకు ఆదర్శం అంటే.. అభిప్రాయాల వ్యక్తీకరణలో అట. జనాలకు.. తనకు మధ్య అడ్డు గోడలు లేకుండా ట్రంప్ అన్ని రకాల మీడియాల ద్వారా నేరుగా తన అభిప్రాయాలు జనాలకు తెలిసేలా చేశాడని.. అమెరికా ఎన్నికల్లో ఆయన విజయానికి అదే దోహదం చేసిందని నాగ్ అభిప్రాయపడ్డాడు. తాను కూడా ట్రంప్ బాటలో నడుస్తానని నాగ్ చెప్పాడు.
‘‘ట్రంప్ విషయంలో కానీ.. బ్రెగ్జిట్ పోల్ విషయంలో కానీ.. జనాలకు నేరుగా సమాచారం వెళ్లింది. ఇలా జనాలతో నేరుగా కమ్యూనికేట్ చేయడం కీలకమైన విషయం. అందుకే నేను కూడా సోషల్ మీడియాను సాధనంగా వాడుతున్నా. ఈ మధ్య బాగా యాక్టివ్ అయ్యాను. మన గురించి ఎవరో చెప్పడం కన్నా.. మన సమాచారం సూటిగా జనాలకు మనమే చేరవేస్తే బాగుంటుందని అనిపించింది. అందుకే నాగచైతన్య-సమంతలకు సంబంధించిన విషయాలన్నీ నేనే సోషల్ మీడియాలో పంచుకున్నాను. మొన్న ఎంగేజ్మెంట్ అవ్వగానే కేవలం పది నిమిషాల్లో వాళ్ల ఫొటోలు షేర్ చేశాను. ట్విట్టర్ వాడటంలో నేనింకా పూర్తిగా పట్టు సాధించలేదు. కానీ నేర్చుకుంటున్నాను. మున్ముందు ట్విట్టర్లో మరింత యాక్టివ్ అవుతా. డిజిటల్ మీడియా మరింత పవర్ ఫుల్ ఫ్లాట్ ఫాం అవుతుంది’’ అని నాగ్ అన్నాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/