నాగ్ భలే ఒప్పించేశాడే

Update: 2017-12-11 11:42 GMT
ఒక దర్శకుడు అండ్ హీరో కనెక్ట్ అయ్యారంటే మళ్లీ మళ్లి వారు సినిమాలను చేయాలనీ అనుకుంటారు. ప్రేక్షకుల్లో కూడా వారి కాంబినేషన్ లో ఓ సినిమాను చేయాలనీ ఎంతో ఆశపడుతుంటారు. అయితే కొంత మంది దర్శకులు ఒక్కోసారి రేంజ్ మారిపోయాక ఒకప్పుడు చేసిన హీరోలతో అంత ఈజీగా చేయరు. వారికీ చేయాలని ఉన్నా కూడా వారికీ తగ్గ కథ దొరక్కపోవడం వల్లనో లేక ఇతర సినిమాల వల్ల బిజీ వల్లనో చేయరు. ఎన్టీఆర్ - రాజమౌళి కాంబో ఎంత హిట్టో అందరికి తెలిసిందే.

యమదొంగ తర్వాత వారిద్దరు మరో సినిమా చేయలేదు. తారక్ కూడా జక్కన్నతో సినిమా చేయాలనీ చాలా ఆశతో ఉన్నాడు. ప్రస్తుతానికి మల్టి స్టారర్ తో సెట్ అయినా ఒకపుడు మాత్రం ఎన్టీఆర్ ఓ సినిమా వేడుకలో జక్కన్న ని లాక్ చేశాడు. నెక్స్ట్ తనతో సినిమా చేస్తావా చేయవా అని గట్టిగా అడిగేశాడు. అయితే జక్కన్న సానుకూలంగా స్పందించి అప్పట్లో తప్పించుకున్నాడు. కానీ రీసెంట్ గా అదే తరహాలో హలో వేడుకలో కూడా ఒక సీన్ రిపీట్ అయ్యింది. నాగార్జున మాత్రం దర్శకుడికి ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వకుండా లాక్ చేశాడు.

మనం సినిమాతో అక్కినేని ఫ్యామిలీ చిరకాలం గుర్తిండిపోయే సినిమాను ఇచ్చిన దర్శకుడు విక్రమ్ కె కుమార్ అంటే నాగ్ కి ఎంతగా ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హలో ఆడియో వేడుకలో చాలా పొగిడేశారు. అంతే కాకుండా నాగ చైతన్య కు కూడా ఒక సినిమా చేయాలి. అందరి ముందు "ఎస్" అని చెప్పు అనడంతో ప్రేక్షకుల వైపు తిరిగి విక్రమ్ తల ఉపక తప్పలేదు. ఏ మాత్రం కన్ఫ్యూజన్ లేకుండా నాగ్ ఆ విధంగా ఒప్పించారంటే నిజంగా గ్రేట్ బిజినెస్ మెన్ అనాల్సిందే. అంతే కాకుండా ఆ దర్శకుడిని మళ్లీ బుక్ చేశాడంటే అతని పనితనం కూడా నాగార్జున కి ఎంత నచ్చిందో చెప్పవచ్చు.
Tags:    

Similar News