వేరే హీరోలతో కలిసి స్క్రీన్ పంచుకోవడానికి అక్కినేని నాగార్జున ఎప్పుడూ వెనుకాడడు. చిన్నా పెద్దా తేడా లేకుండా.. భాషా భేదం లేకుండా ఎప్పట్నుంచో మల్టీస్టారర్లు చేస్తున్నాడు నాగ్. మల్టీస్టారర్లు పూర్తిగా మరుగున పడిపోయిన సమయంలో మోహన్ బాబుతో ‘అధిపతి’.. శ్రీకాంత్ తో ‘నిన్నే ప్రేమిస్తా’ లాంటి సినిమాలు చేశాడు నాగ్. హిందీ.. తమిళ భాషల్లోనూ నాగ్ వేరే హీరోలతో కలిసి నటించాడు.
ఈ మధ్యే తమిళ యువ కథానాయకుడు కార్తితో కలిసి నాగ్ నటించిన ‘ఊపిరి’ మంచి ఫలితాన్నందించింది. ఇప్పుడు నానితో కలిసి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఒక మల్టీస్టారర్ చేయడానికి నాగ్ రెడీ అవుతున్నసంగతి తెలిసిందే. ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లకముందే నాగ్ పేరుతో మరో మల్టీస్టారర్ వార్తల్లోకి వచ్చింది. అందులో నాగార్జునతో కలిసి నటించే కథానాయకుడంటూ ప్రచారంలో ఉన్న హీరో ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.
తమిళంలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా కేవలం తన టాలెంటుతో స్టార్ హీరోగా ఎదిగిన ధనుష్ తో కలిసి నాగ్ ఓ మల్టీ లాంగ్వేజ్ మల్టీస్టారర్ చేయబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ కాంబినేషన్లో సినిమా తీసేదెవరన్నది తెలియలేదు కానీ.. ఇద్దరూ కలిసి ఓ కథ గురించి చర్చించినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. నిజంగా ఇది నిజమైతే ఇటు నాగ్ అభిమానులకు.. అటు ధనుష్ అభిమానులకు ఆనందాన్నిచ్చే విషయమే. దక్షిణాదిన ఇదో ఎగ్జైటింగ్ కాంబినేషన్ అవుతుందనడంలో సందేహం లేదు. ఈ చిత్రం ఓకే అయితే తెలుగు.. తమిళ.. హిందీ భాషల్లో తెరకెక్కుతుందని సమాచారం.