కింగ్ నాగార్జునకు సరైన బ్లాక్ బస్టర్ హిట్టు పడి చాలా కాలమవుతోంది. శివ తరహాలో కల్ట్ క్లాసిక్ హిట్ కావాలని ఆర్జీవీతో మరో ప్రయత్నం చేసినా అది కాస్తా డిజాస్టర్ అవ్వడం నిరాశపరిచింది. ఆర్జీవీతో `ఆఫీసర్` అస్సలు వర్కవుట్ కాలేదు. ప్రస్తుతం `వైల్డ్ డాగ్` అనే ఓ కాన్సెప్ట్ బేస్డ్ థ్రిల్లర్ లో నటిస్తున్నారు. కొన్ని వాస్తవ సంఘటనలు అధారంగా సోలోమాన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో నాగ్ ఐఎన్ ఏ అధికారి ఏసీపీ విజయ్ వర్మ పాత్రను పోషిస్తున్నారు. ఇప్పటికే నాగ్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. సీరియస్ ఆపరేషన్ కి సిద్ధమైన కాప్ లుక్ లో నాగ్ ఆకట్టుకున్నారు.
తొలి పోస్టర్ లోనే ఇన్విస్టిగేషన్ నేపథ్యంలో సాగే స్టోరీ ఇది అని రివీల్ చేసారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ గోవాలో జరుగుతుంది. కీలక యాక్షన్ సన్నివేశాలను అక్కడే తెరకెక్కిస్తున్నారు. వాస్తవానికి చైనా..థాయ్ లాండ్ లో భారీ షెడ్యూల్స్ ప్లాన్ చేసినా.. కరోనా వైరస్ కారణంగా అక్కడి షెడ్యూల్స్ వాయిదా వేసారు. కరోనా అదుపులోకి రాగానే యూనిట్ థాయ్ లాండ్ ప్లైట్ ఎక్కనుంది. అయితే తాజాగా నాగార్జున కొత్త ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
గోవా వెళుతూ శనివారం నాడు హైదరాబాద్ ఎయిర్ పోర్టులో నాగార్జున కెమెరా కంటికి చిక్కారు. నాగ్ క్యాజువల్ వేర్ లో సింపుల్ గా కనిపించారు. బాడీ ఫిట్ టీషర్టుతో సింపుల్ గా ఉన్నారు. 60 వయసులోనూ కింగ్ ఫిట్ లుక్ అభిమానుల్లో స్ఫూర్తి నింపుతోంది. ఎన్.ఐ.ఏ అధికారి పాత్ర కోసం నాగార్జన రెగ్యులర్ వర్కవుట్లతో చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. పర్ఫెక్ట్ లుక్ ని మెయింటెయిన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతున్నాయి. అలాగే నాగ్ తన ట్విటర్ ఖాతాలో సినిమా కు సంబంధించిన ఆసక్తికర విషయాలు వెల్లడించారు. చాలా కాలం తర్వాత ఓ ఛాలెంజింగ్ రోల్ చేస్తున్నా. ఓ రియల్ ఆఫీసర్ కథలా ఉంటుంది. కొత్త టెక్నికల్ టీమ్ తో జర్నీ బాగుంది. 2020 హ్యీపీగా సాగిపోతుందని తెలిపారు.