నాగార్జున డబుల్ రోల్ లో కనిపించిన సోగ్గాడే చిన్ని నాయన చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఆ సినిమా విడుదల అయ్యి దాదాపుగా అయిదు సంవత్సరాలు కాబోతుంది. ఆ చిత్రం విడుదల అయిన వెంటనే బంగార్రాజు చిత్రం చేయబోతున్నట్లుగా ప్రకటించారు. సోగ్గాడే చిన్ని నాయన చిత్రంలోని బంగార్రాజు పాత్రను బేస్ చేసుకుని కథను రెడీ చేస్తున్నట్లుగా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ప్రకటించాడు. ఈ నాలుగు సంవత్సరాలుగా సినిమాకు సంబంధించి అనేక సార్లు వార్తలు వచ్చాయి.
గత ఏడాది చివర్లో నాగార్జున మరియు నాగచైతన్యలు కలిసి ఆ చిత్రంలో నటించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. కథ విషయంలో మళ్లీ ఏం జరిగిందో ఏమో కాని అటకెక్కింది. వైల్డ్ డాగ్ చిత్రం చేస్తున్న నాగార్జున ఆ తర్వాత అయినా బంగార్రాజును చేస్తాడేమో అనుకున్నారు. కాని నాగార్జున వైల్డ్ డాగ్ తర్వాత ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఒక సినిమాను చేసేందుకు ఓకే చెప్పాడు. ఇప్పటికే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. త్వరలోనే సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.
వైల్డ్ డాగ్ ఆ వెంటనే ప్రవీణ్ సత్తారు చిత్రం మూవీని నాగ్ చేయబోతున్నాడు. కనుక నాగార్జున బంగార్రాజు చిత్రంను దాదాపుగా వదిలేసినట్లే అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. నాగ్ సూచన మేరకు దర్శకుడు కళ్యాణ్ కృష్ణ మరో సినిమాను ప్రయత్నించబోతున్నాడట. ఈ లాక్ డౌన్ లో కళ్యాణ్ కృష్ణ ఇద్దరు ముగ్గురు హీరోలకు కథలు చెప్పాడట. వాటిలో ఏదో ఒకటి సెట్ అయ్యే అవకాశం ఉంది. కనుక బంగార్రాజు గురించి మళ్లీ చర్చ జరిగేనో లేదో తెలియదు అంటున్నారు.