`దేవ‌దాస్‌`కి సీక్వెల్ కూడా ఉంటుంద‌ట‌

Update: 2018-08-01 14:33 GMT
నాగార్జున నాని క‌లిసి ఓ చిత్రంలో న‌టించారు. అదే... దేవ‌దాస్‌. ఆ సినిమా అంచ‌నాల‌కి త‌గ్గ‌ట్టుగా ఆడితే మాత్రం మ‌రోసారి నాగ్‌ - నానిల్ని క‌లిసి చూసే అవ‌కాశం ఉంటుంద‌ట‌. ఆ విష‌యాన్ని స్వ‌యంగా నాగార్జునే బ‌య‌ట‌పెట్టారు. దేవ‌దాస్ గ‌న‌క హిట్ట‌యితే దానికి సీక్వెల్‌ కూడా చేయాల‌నుకొంటున్నామ‌ని చెప్పాడు నాగ్‌. సుశాంత్ క‌థానాయ‌కుడిగా న‌టించిన `చి.ల‌.సౌ` ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా నాగార్జున బుధ‌వారం హైద‌రాబాద్‌ లో మీడియాతో స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగానే దేవ‌దాస్ గురించి ఆస‌క్తిక‌ర‌మైన  ఈ కామెంట్‌ ని చేశాడు.

``దేవ‌దాస్ సినిమాలో నా పేరు దేవ్‌ - నాని పేరు దాస్‌. సినిమా మొత్తం ఎంట‌ర్‌ టైనింగ్‌ గా సాగుతుంది. నాని టాలెంటెడ్ యాక్ట‌ర్‌. త‌న‌తో క‌లిసి న‌టించ‌డం చాలా బాగుంది. సినిమా హిట్ట‌యితే మేమిద్ద‌రం మ‌ళ్లీ ఈ సినిమాకి సీక్వెల్  చేస్తాం`` అని చెప్పుకొచ్చాడు నాగార్జున‌. అలాగే సోగ్గాడే చిన్నినాయ‌నా సీక్వెల్ గురించి కూడా చెప్పుకొచ్చాడు నాగ్‌. ప్ర‌స్తుతం ద‌ర్శ‌కుడు క‌ళ్యాణ్ కృష్ణ‌ - స‌త్యానంద్ `సోగ్గాడే...` సీక్వెల్ క‌థ‌ని  సిద్ధం చేస్తున్నారు. ఏది ముందు స్క్రిప్టు ప‌క్కాగా కుదిరితే దాన్ని అనౌన్స్‌ చేస్తాం`` అని ప్ర‌క‌టించాడు నాగార్జున. ఆయ‌న త్వ‌ర‌లోనే ఓ త‌మిళ సినిమా గురించి ప్ర‌క‌టిస్తాన‌ని చెప్పాడు. ఈయేడాది నాగ్ ఇప్ప‌టికే హిందీలో ఓచిత్రం చేస్తున్నాడు. మ‌ల‌యాళంలోనూ ఆయ‌న ఓ సినిమా ఒప్పుకొన్న‌ట్టు ప్ర‌చారం సాగింది. ఇప్ప‌డు త‌మిళ చిత్రం కూడా. మొత్తంగా ఇటు సౌత్‌ - అటు బాలీవుడ్. అంతా చుట్టేస్తున్నాడు నాగార్జున‌.
Tags:    

Similar News