నేరుగా 'రా' నే..నో సోడా నో వాటర్!: నాగార్జున

Update: 2018-09-25 12:30 GMT
మనసులో ఒకటి బయటకు ఒకటి మాట్లాడేవాళ్ళు మన చుట్టూ ఉండేవారిలో చాలామంది ఉంటారు. ఓపెన్ గా మాట్లాడేవాళ్ళు చాలా తక్కువ మంది. ఇక సెలబ్రిటీల విషయానికి వస్తే ఏం మాట్లాడితే ఏమౌతుందో అని జాగ్రత్తగా మాట్లాడతారు. ఇక హిపోక్రసీ అని పదానికి చాలామంది బ్రాండ్ అంబాజిడర్లలాగా ఉంటారు. కానీ అక్కినేని నాగార్జున మాత్రం దాదాపు ఓపెన్ గానే మాట్లాడతాడు.  సీనియర్ హీరోల మల్టిస్టారర్ గురించి అడిగితే 'ముసలోళ్ళ మల్టి స్టారర్ ఎవరు చూస్తారండి' అని నవ్వేశాడు.

ఇక 'దేవదాస్' సినిమా టీజర్ లో మందు కొట్టే సీన్ ఉంది కదా.  నాగార్జున రెండు గ్లాసుల్లో మందు పోసి.. నాని ని "మందులోకి సోడా కావాలా.. నీళ్లు కావాలా" అని అడిగితే నాని నేరుగా 'రా' తాగేస్తాడు.  ఈ సీన్ గురించి మాట్లాడుతూ నాని ని ఇలా అడిగాడు "నీకు 'రా' తాగడం నేను నేర్పించానా.. నీకే తెలుసా?"  ఈ ప్రశ్నకు నాని "నేను బేసిగ్గా రా తాగను సర్" అన్నాడు. ఇక టాపిక్ కంటిన్యూ చేస్తూ "నేను మాత్రం 'రా'నే తాగుతా" అన్నాడు.  ఇక రిపోర్టర్స్ అదేంటి సర్ అని అడిగితే "వాళ్లు అంత కష్టపడి తయారు చేస్తే దాంట్లో సోడానో.. నీళ్లో కలిపి పాడు చేస్తే ఎలా?" అంటూ లాజిక్ చెప్పాడు.

కాస్ట్లీ బ్రాండ్స్ అయితే 'రా' తాగినా ఏం కాదు. కరెక్ట్ గా తాగాల్సిన మెథడ్ అదే.. అందుకే అమెరికన్స్.. యూరోపియన్స్ లో మెజారిటీ మందుప్రియులు అలానే తాగుతారు.  కానీ పిచ్చ పిచ్చ బ్రాండ్లను అక్కినేని వారు చెప్పినట్టు తాగితే పేగు పొక్కడం మాత్రం గ్యారెంటీ. తస్మాత్ జాగ్రత్త! 
Tags:    

Similar News