సినిమా తీయడం కంటే దాన్ని సరిగా ప్రమోట్ చేసి జనాలకు చేరువ చేయడం.. వాళ్లను థియేటర్ కి లాక్కువ రావడం చాలా ప్రధానమైన విషయం ఈ రోజుల్లో. ప్రమోషన్ అనేది ఎంత ముఖ్యమో మన టాలీవుడ్ బడా హీరోలకు ఇప్పుడిప్పుడే బాగా అర్థమవుతోంది. ఇంతకుముందు సినిమాల ప్రచారానికే రాని మహేష్ బాబు.. ఈ మధ్య తన సినిమాల్ని ఎలా ప్రమోట్ చేసుకుంటున్నాడో చూస్తున్నాం కదా. మిగతా హీరోలు కూడా ఇదే బాటలో నడుస్తున్నారు. ఐతే ఎప్పుడూ అట్ టు డేట్ గా ఉండే నాగార్జునకు ఈ విషయం తెలియందేమీ కాదు. అయినా సంక్రాంతికి విడుదల కావాల్సిన తన కొత్త సినిమా ‘సోగ్గాడే చిన్ని నాయనా’ విషయంలో సైలెంటుగా ఉంటున్నాడు.
అప్పుడెప్పుడో ఓ టీజర్ వదిలేసి మళ్లీ ఇంకే హడావుడీ చేయలేదు నాగ్. షూటింగ్ విషయంలో కానీ.. పోస్ట్ ప్రొడక్షన్ గురించి కానీ ఎలాంటి అప్ డేట్స్ లేవు. ఆడియో డేట్ ఊసు కూడా లేదు. సినిమా ఏమో ఎప్పుడో ఫినిష్ అయిపోయిందన్నారు. అలాంటపుడు అప్పుడప్పుడూ మీడియాలో వార్తలు వచ్చేలా అప్ డేట్స్ ఇవ్వడం లాంటివేమీ జరగట్లేదు. సంక్రాంతి రిలీజ్ అంటే ఇంకో వారం పది రోజుల్లో ఆడియో రిలీజ్ చేసి తీరాలి. ఐతే నాగ్ తీరు చూస్తుంటే అసలు ఈ సినిమా గురించి పట్టించుకుంటున్నట్లే లేడు. నిజంగా సంక్రాంతి విడుదలకు రెడీ అవుతుంటే మాత్రం ఇలా ఏ హంగామా లేకుండా ఉంటే కష్టం. సంక్రాంతి బరిలో ఉన్న డిక్టేటర్, నాన్నకు ప్రేమతో సినిమాలు ఎప్పుడూ వార్తల్లో ఉంటున్నాయి. వాటికి హైప్ కూడా బాగానే ఉంది.