‘రాజు గారి గది-2’ తర్వాత అక్కినేని నాగార్జున ఏం సినిమా చేస్తాడనే విషయంలో ఎవరికీ క్లారిటీ లేదు. అంతా అనుకున్నట్లుగా జరిగితే ‘సోగ్గాడే చిన్నినాయనా’ ఫేమ్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ‘బంగార్రాజు’ చేయాల్సింది. కానీ ఆ సినిమా కథ విషయంలో నాగార్జునను కళ్యాణ్ సంతృప్తి పరచలేకపోవడంతో ఆ ప్రాజెక్టు పక్కకు వెళ్లిపోయింది. నాగ్ కూడా తర్వాత ఏం చేయాలో తెలియని అయోమయంలో పడిపోయాడు. ఐతే తర్వాతి సినిమా ఎప్పుడు సెట్టయితే అప్పుడు చూద్దామని.. నాగ్ నెమ్మదిగా కథలు వింటున్నట్లు సమాచారం. ఐతే తాజాగా నాగ్ ముందుకు తమిళ సూపర్ హిట్ మూవీ ‘విక్రమ్ వేద’ రీమేక్ వచ్చినట్లు సమాచారం. తమిళంలో ఈ చిత్రాన్ని రూపొందించిన గాయత్రి-పుష్కర్ (భార్యాభర్తలు) నాగ్ ను సంప్రదించినట్లు తెలుస్తోంది.
ముందు ‘విక్రమ్ వేద’ రీమేక్ ను వెంకటేష్-రానా కాంబినేషన్లో చేయాలనుకున్నారు. ఐతే కొన్ని కారణాల వల్ల వెంకీ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు సమాచారం. రానా సంగతి ఏమో కానీ.. నాగార్జునను అయితే సంప్రదించారట గాయత్రి-పుష్కర్. తమిళంలో విజయ్ సేతుపతి చేసిన పాత్రను నాగార్జునతో చేయించాలనుకుంటున్నారట. కానీ నాగార్జున ఆ పాత్రకు సూటవుతాడా అన్నది డౌటు. ఎందుకంటే అది క్రూరమైన క్రిమినల్ పాత్ర. విజయ్ సేతుపతి లుక్స్.. అతడి నటన ఆ పాత్రకు బాగా సూటయ్యాయి. కానీ ఇలాంటి వయొలెంట్ క్యారెక్టర్లో నాగ్ ఎంతమేరకు సూటవుతాడన్నది సందేహం. నాగ్ అనే కాదు.. తెలుగులో విజయ్ సేతుపతి చేసిన పాత్రకు పర్ఫెక్టుగా సూటయ్యే నటుడు ఎవరు అంటే వెంటనే సమాధానం రాకపోవచ్చు. ఆ పాత్ర అలాంటిది మరి. మాధవన్ చేసిన ఫెరోషియస్ పోలీస్ పాత్రకు ఎవరైనా సెట్టయిపోతారు కానీ.. విజయ్ సేతుపతి పాత్రకు తగ్గ నటుడిని ఎంచుకోవడం మాత్రం కష్టమే. ఉన్నంతలో వెంకీనే కాస్త బెటర్. మరి పుష్కర్-గాయత్రి ఎవరిని ఫైనలైజ్ చేస్తారో చూడాలి.